Konatala Ramakrishna : జనసేన పార్టీ లోకి కొణతాల రామకృష్ణ..!

నేడు హైదరాబాద్ జనసేన పార్టీ ఆఫీసులో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యాడు. సుమారుగా గంటసేపటి పైగా సాగిన ఈ భేటీలో పవన్ కళ్యాణ్ మరియు కొణతాల రామకృష్ణ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయాలపై, అలాగే ఉత్తరాంధ్ర జిల్లా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

Konatala Ramakrishna : జనసేన పార్టీ లోకి కొణతాల రామకృష్ణ..!
X

న్యూస్ లైన్, హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల మరో మూడు నెలల్లో జరగబోతుంది. ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యం లో రాజకీయ నాయకులు ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ లకి మారడం మొదలు పెట్టారు. నేడు హైదరాబాద్ జనసేన పార్టీ ఆఫీసులో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యాడు. సుమారుగా గంటసేపటి పైగా సాగిన ఈ భేటీలో పవన్ కళ్యాణ్ మరియు కొణతాల రామకృష్ణ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయాలపై, అలాగే ఉత్తరాంధ్ర జిల్లా రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ నెల 26 వ తారీఖున ఆయన జనసేన పార్టీ లో చేరబోతున్నాడని టాక్. అనకాపల్లి ఎంపీ స్థానం నుండి ఆయన జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతం లో సీనియర్ నాయకుడిగా, కొణతాల రామకృష్ణ కి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. బీసీ సామజిక వర్గానికి చెందిన కొణతాల రామకృష్ణ 1989 వ సంవత్సరం నుండి 1996 వ సంవత్సరం వరకు పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగాడు.

ఆ తర్వాత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయన క్యాబినెట్ లో వాణిజ్యపన్నులు, ఎక్సైజ్‌, న్యాయ తదితర శాఖలకు మంత్రిగా పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి ఆయన. ఆ తర్వాత 2009 వ సంవత్సరం లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి , హెలికాప్టర్ ప్రమాదం లో చనిపోయిన తర్వాత, ఇక నుండి జగన్ తోనే తన ప్రయాణం అని నిర్ణయించుకొని వైసీపీ పార్టీ లో చేరాడు. ఆ పార్టీ లో ఆయన పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటి చైర్మన్‌గా పనిచేశారు. 2014 ఎన్నికలలో వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన కొణతాల , ఆ పార్టీ కి రాజీనామా చేసి బయటకి వచ్చేసాడు. అప్పటి నుండి నేటి వరకు ఆయన ఏ పార్టీ లో కూడా చేరకుండా సొంతంగా ఉత్తరాంధ్ర ప్రాంత సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసాడు. ఉత్తరాంధ్ర కి రైల్వే జోన్ ఇవ్వాలని ఆయన చేసిన పోరాటం ని అంత తేలికగా ఎవ్వరూ మర్చిపోలేరు. అలాంటి వ్యక్తి నేడు జనసేన పార్టీ లో చేరడం ఆ పార్టీ కి ఎంతో ప్లస్ అనే చెప్పాలి. మరి పవన్ కళ్యాణ్ ఈయనకి అనకాపల్లి ఎంపీ టికెట్ ఇప్పిస్తాడా లేదా అనేది చూడాలి.

Tags:
Next Story
Share it