kurnool : పొలం దున్నుతుండగా రైతుకు కళ్లు తిరిగే అదృష్టం తగిలింది..

దృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో తెలియదు. ఒక్క దెబ్బతో ఓడలు బల్లు కావచ్చు బల్లు ఓడలు కావచ్చు. ఇప్పుడు అదే జరిగింది ఓ సాధారణ రైతు జీవితంలో. పొలం పనులు చేసుకుందామని భూమిని దున్నితే రైతుకు అదృష్ట దేవత దర్శనమిచ్చింది. ఇంతకు ఆయనకు ఏం దొరికిందంటే..

kurnool : పొలం దున్నుతుండగా రైతుకు కళ్లు తిరిగే అదృష్టం తగిలింది..
X

న్యూస్ లైన్ డెస్క్ : అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా వరిస్తుందో తెలియదు. ఒక్క దెబ్బతో ఓడలు బల్లు కావచ్చు బల్లు ఓడలు కావచ్చు. ఇప్పుడు అదే జరిగింది ఓ సాధారణ రైతు జీవితంలో. పొలం పనులు చేసుకుందామని భూమిని దున్నితే రైతుకు అదృష్ట దేవత దర్శనమిచ్చింది. ఇంతకు ఆయనకు ఏం దొరికిందంటే..

ఏపీలోని కర్నూలు జిల్లాలో ఓ రైతును అదృష్ట దేవత వరించింది. అతడికి పొలంలో విలువైన వజ్రం లభించింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జసనేపల్లిలో గ్రామానికి చెందిన ఓ రైతు తనకు ఉన్న పొలంలో పంటను పండించడానికి ఎడ్లతో దున్న సాగాడు. నేలను చేస్తుండగా కళ్లు మెరిసిపోయేలా ఓ రాయి కనిపించింది.

ఆ రాయిని చేతుల్లోకి తీసుకుని పరిశీలించగా వజ్రం అని స్పష్టమైంది. సదరు వజ్రం 10 క్యారెట్లు ఉన్నట్లు రైతు నిర్ధారణ చేసుకున్నాడు. ఈ వజ్రంతో తన కష్టాలు తీరిపోయాయని రైతు సంబరపడిపోయాడు. విషయం తెలుసుకున్న వ్యాపారులు వజ్రం కొనడానికి పోటీ పడ్డారు. చివరగా గుత్తికి చెందిన ఓ వ్యాపారి 2 కోట్లకు ఈ వజ్రాన్ని సొంతం చేసుకున్నాడు.

Tags:
Next Story
Share it