KUSHBOO : టీడీపీ నేత బండారు మనిషే కాదు

ఏపీ మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ మూర్తి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన వివాదంపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, ప్రముఖ నటి కుష్బూ స్పందించారు. బండారు సత్యనారాయణ మూర్తిపై కుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాపై ఆయన చేసిన వాక్యాలు దారుణమన్నారు. మహిళా మంత్రిపై బండారు వాక్యాలు దిగజారుడుతనానికి నిద

KUSHBOO : టీడీపీ నేత బండారు మనిషే కాదు
X

KUSHBOO : ఏపీ మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ మూర్తి వివాదస్పద వ్యాఖ్యలు చేసి.. జైలు పాలైన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఏపీ మంత్రి రోజాపై బండారు సత్యనారాయణ మూర్తి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన వివాదంపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు, ప్రముఖ నటి కుష్బూ స్పందించారు. బండారు సత్యనారాయణ మూర్తిపై కుష్బూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రోజాపై ఆయన చేసిన వాక్యాలు దారుణమన్నారు.

మహిళా మంత్రిపై బండారు వాక్యాలు దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. ఆయన ఒక మనిషిగా కూడా విఫలమయ్యాడని, వెంటనే రోజాకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రధాని మోదీ తీసుకొచ్చారని... ఇలాంటి తరుణంలో బండారు లాంటి వాళ్ళు మహిళలపై ఇంత దారుణంగా మాట్లాడతారా అంటూ మండిపడ్డారు.

మహిళని గౌరవించే వాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరని.... మహిళలను దూషించడం బండారుకి జన్మ హక్కు అనుకుంటున్నారా అని కుష్బూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండారు సత్యనారాయణ మూర్తి రాష్ట్ర, తన నియోజకవర్గ మహిళలను అవమానించినట్లే అన్నారు.

Tags:
Next Story
Share it