Lakshmi Parvathi : TDPని కళ్యాణ్ రామ్, NTRలకు అప్పగించాలి

Lakshmi Parvathi :  టిడిపిని నందమూరి కుటుంబానికి అప్పగించాలని...ముఖ్యంగా కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌

Lakshmi Parvathi :  TDPని కళ్యాణ్ రామ్, NTRలకు అప్పగించాలి
X

Lakshmi Parvathi : టిడిపిని నందమూరి కుటుంబానికి అప్పగించాలని...ముఖ్యంగా కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌ లకు పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరారు తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మి పార్వతి. ఇవాళ మీడియాతో లక్ష్మి పార్వతి మాట్లాడుతూ... చంద్రబాబు హయాంలో సెల్ఫ్ డబ్బా తప్ప.. అభివృద్ది శూన్యమని... ఎన్నో కష్టాలు పడిన వైఎస్ జగన్ కు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు గత ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టారని వెల్లడించారు.

టిడిపి హయాంలో చంద్రబాబు ధనవంతుడు అయ్యాడే తప్ప.. నిరుపేదలు అలాగే ఉన్నారని... 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు.. ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి చెయ్యలేదని ఆగ్రహించారు లక్ష్మి పార్వతి. పుత్రుడు, దత్త పుత్రుడు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినా.. ప్రజలు నమ్మబోరని... NTR మనవడు గా లోకేష్ ను ప్రజలు రిసీవ్ చేసుకోవడం లేదు.. నక్కకి నాగ లోకానికి ఉన్నంత తేడా ఉందని చురకలు అంటించారు లక్ష్మి పార్వతి. చంద్రబాబు నాయడు ఇసుక మీద 4 వేల కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించారని... చంద్రబాబు సైకో, శాడిస్ట్ కాబట్టే.. ప్రశ్నించే వారిని గుర్రాలతో తొక్కించారు..తహశీల్దార్ వనజాక్షినీ బెదిరించాడని గుర్తు చేశారు.

నాయి బ్రాహ్మణులను జైల్లో పెడతానని బెదిరించాడని... లోకేష్ అయోమయంలో మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు లక్ష్మి పార్వతి. టిడిపి ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వైసీపీ హయాంలో జరిగినట్లు విమర్శలు చేస్తున్నారని... అధికారంలోకి రాక ముందే దత్త పుత్రుడు, సొంత పుత్రుడు చంపుతా, నరుకుతా, బట్టలు విప్పి కొడతా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు లక్ష్మి పార్వతి. 2019లోనే చంద్రబాబు చాప్టర్ క్లోజ్ అయింది.. సినిమాలు చేసుకుంటున్న పవన్ ను తీసుకొచ్చి.. కాపు నాయకుల్ని తిట్టిస్తున్నాడని ఆగ్రహించారు లక్ష్మి పార్వతి.

Tags:
Next Story
Share it