Tirumala :  చిన్నారి లక్షితను చంపిన చిరుత బోనులో చిక్కింది

తిరుమలలో రెండు రోజుల కిందట లక్ష్మిత అనే నెల్లూరు కు చెందిన చిన్నారిని చిరుత దాడిలో మరణించిన

Tirumala :  చిన్నారి లక్షితను చంపిన చిరుత బోనులో చిక్కింది
X

Tirumala : తిరుమలలో రెండు రోజుల కిందట లక్ష్మిత అనే నెల్లూరు కు చెందిన చిన్నారిని చిరుత దాడిలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే..రెండు రోజుల కిందట తిరుమలలో బాలికపై దాడిచేసి చంపేసిన చిరుత చిక్కింది. బాలిక మృతి నేపథ్యంలో ఘటన స్థలితో పాటు చుట్టుపక్కల మూడు బోన్లతో పాటు సీసీ కెమెరాలు అటవీ శాఖ సిబ్బంది ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో తిరుమల- అలిపిరి కాలినడక మార్గంలోని ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో సోమవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. అటవీశాఖ అధికారులు ఆ ప్రాంతానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. శుక్రవారం నెల్లూరు జిల్లాకు చెందిన లక్షిత అనే ఆరేళ్ల బాలిక తన తల్లిదండ్రులతో అలిపిరి నడక మార్గంలో వెళ్తుండగా చిరుత దాడి చేసి పొట్టన పెట్టుకుంది.

ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. గతంలోను చిన్నారిపై దాడి చేసిన చిరుతను బంధించి కళ్యాణ్ ట్యాంకు సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Tags:
Next Story
Share it