Srisailam : శ్రీశైలంలో అపచారం.. !

శ్రీశైలం భ్రమరాంభిక మల్లిఖార్జున స్వామి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. ఆలయ ప్రసాదాల్లో మాంసం ముక్కలు వచ్చినట్లుగా తెలుస్తోంది.

Srisailam : శ్రీశైలంలో అపచారం.. !
X

న్యూస్ లైన్, శ్రీశైలం : శ్రీశైలం భ్రమరాంభిక మల్లిఖార్జున స్వామి ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. ఆలయ ప్రసాదాల్లో మాంసం ముక్కలు వచ్చినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన కె.వేణుగోపాల్ అనే భక్తుడు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళ్లారు. అక్కడ ప్రసాదం పంపిణీలో భాగంగా ఆలయ సిబ్బంది భక్తుడికి పులిహోర పెట్టారు. అయితే అది తింటున్న వేణుగోపాల్ కు నోట్లో ఏదో తగిలినట్లు అనిపించింది. తీరా అది చేస్తే మాంసం ఎముకగా గుర్తించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భక్తుడు ఆలయ ఈవోకు ఫిర్యాదు చేశారు. ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఆలయ ప్రసాదంలోనే ఇలా రావడం ఏంటని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా సిబ్బంది వ్యవహారం ఉందంటూ అసహనం వ్యక్తం చేశారు. భక్తుడి ఫిర్యాదు మేరకు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Tags:
Next Story
Share it