దారుణం.. చనిపోయిన మహిళకు 3 రోజులు వైద్య చికిత్స!

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా చాలా మంది చూసే ఉంటారు. అదే తరహాలో తాజాగా ఏలూరు నగరంలో చోటుచేసుకుంది.

దారుణం.. చనిపోయిన మహిళకు 3 రోజులు వైద్య చికిత్స!
X

AP: మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా చాలా మంది చూసే ఉంటారు. అదే తరహాలో తాజాగా ఏలూరు నగరంలో చోటుచేసుకుంది. ఠాగూర్ సినిమా తరహాలో చనిపోయిన మహిళకు మూడు రోజులపాటు వైద్యం అందిస్తూ.. మృతురాలి కుటుంబ సభ్యుల నుంచి లక్షల రూపాయలు దోచుకుని, మృతదేహాన్ని అప్పగించారు. ఈ ఘటన గురించి విన్న ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సదరు ఆసుపత్రికి అనుమతులు ఉన్నాయా? లేక అనధికారికంగా రాజకీయ నాయకుల అండదండలతో అధికారుల అనధికార అనుమతులతో నిర్వహిస్తున్నారా ? అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కొప్పాక గ్రామంలో నివసిస్తున్న దేవరపల్లి అంజలి ప్రియ గత కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతూ వైద్యం నిమిత్తం కొన్ని రోజుల క్రితం స్థానిక ఏలూరులోని ఓ ప్రైవేట్ హాస్పటల్లో చేరారు. తొమ్మిది రోజులు గడుస్తున్నప్పటికీ ఆమెకు వైద్యంతో కడుపునొప్పి తగ్గడం లేదు. అప్పటివరకు అంజలి ప్రియ బంధువులు వద్ద వైద్యం, పరీక్షల నిమిత్తం రూ.5 లక్షలకు పైగా వసూలు చేసి చివరికి మృతురాలు చనిపోయిందని.. ఇంటికి తీసుకు వెళ్లిపోండని మంగళవారం ఉదయం ప్రకటించారు. దీనిపై అంజలి ప్రియ బంధువులు ఆసుపత్రి యాజమాన్యంపై వాగ్వాదానికి దిగారు. హఠాత్తుగా పేషెంట్ చనిపోవడం ఏమిటని గట్టిగా నిలదీశారు. ఆసుపత్రి ఎదురుగా బైఠాయించి ఆసుపత్రి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ విషయంపై తమకు రాష్ట్రస్థాయి ఉన్నత కమిటీ వేసి నిగ్గు తేల్చాలని.. న్యాయం జరగకపోతే తామంతా న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని.. ఇటువంటి ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు ఉండకూడదని వారు డిమాండ్ చేశారు.

Tags:
Next Story
Share it