YSRTP: కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనం.. వైఎస్ షర్మిల క్లారిటీ!

ఈనెల 4న కాంగ్రెస్‌ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం..?

YSRTP: కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపీ విలీనం.. వైఎస్ షర్మిల క్లారిటీ!
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో (Congress Party) వైఎస్సార్టీపీ(YSRTP) విలీనంపై గత కొద్దిరోజులుగా వస్తున్న వార్తలకు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila Reddy) చెక్ పెట్టారు. వైఎస్సార్టీపీ పార్టీ విలీనంపై షర్మిల క్లారిటీ ఇచ్చారు.

వివరాల్లోకి వెళితే.. మంగళవారం లోటస్‌ పాండ్‌లో ముఖ్య నేతలతో షర్మిల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ విలీనంపై నేతలకు స్పష్టతనిచ్చారు. జనవరి 4న వైఎస్సార్టీపీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేయడం ఖాయమని ఆమె స్పష్టం చేశారు. రేపు సాయంత్రం కల్లా అందరూ ఢిల్లీ చేరుకోవాలని నేతలకు అధినేత్రి చెప్పారు. ఏఐసీసీలో కీలక పదవిలో ఉంటామని ముఖ్య నేతలకు షర్మిల చెప్పినట్లు సమాచారం. షర్మిల ప్రకటనతో వైఎస్సార్టీపీ విలీనంపై గత కొద్దిరోజులుగా వస్తున్న ప్రచారానికి తెరపడినట్లైంది.

మరోవైపు ఇప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల నుంచి షర్మిలకు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ఈ నెల 4న ఢిల్లీకి రావాలని షర్మిలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే నుంచి పిలుపు వెళ్లింది. 4న ఉదయం 11 గంటలకు ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఆ సమయంలోనే వైఎస్సార్టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారు.

Next Story
Share it