Pawan kalyan: కోట్లాది మంది ఎదురు చూపు.. పవన్ ఆసక్తికర ట్వీట్!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టులో మధ్యంతర బెయిల్ లభించిన విషయం తెలిసిందే.

Pawan kalyan: కోట్లాది మంది ఎదురు చూపు.. పవన్ ఆసక్తికర ట్వీట్!
X

న్యూస్‌లైన్, డెస్క్: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu naidu) హైకోర్టులో మధ్యంతర బెయిల్ లభించిన విషయం తెలిసిందే. రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు సాయంత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఆయన తనయుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నారు. మరోవైపు టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ (pawan kalyan) స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందిస్తూ.. మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరమని అన్నారు.

చంద్రబాబు నాయుడు హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరమని, సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని కొనియాడారు. చంద్రబాబు విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారని, అందరం ఆయనను స్వాగతిద్దామని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.

Tags:
Next Story
Share it