Roja: టీడీపీ నేతపై మంత్రి రోజా పరువు నష్టం దావా!

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇటీవల మంత్రి రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర దుమారం రేగింది.

Roja: టీడీపీ నేతపై మంత్రి రోజా పరువు నష్టం దావా!
X

న్యూస్‌లైన్, డెస్క్: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఇటీవల మంత్రి రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై తీవ్ర దుమారం రేగింది. ఆ వ్యాఖ్యలకు గాను మంత్రి రోజా కంటతడి పెట్టుకున్నారు. అదే సమయంలో తనకు మద్దతు ప్రకటించారు. సత్యనారాయణ పై విమర్శలు చేశారు. కొంతకాలం ఈ వివాదం సర్దు మణిగిందని అనుకున్నారు. కానీ ఈ క్రమంలోనే బండారు సత్యనారాయణమూర్తిపై పరువు నష్టం దావా వేశారు. మంగళవారం నగరి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ వేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమె ఈ పిటిషన్ వేశారు.

తన పరువుకు నష్టం కలిగించే విధంగా బండారు సత్యనారాయణ మూర్తి వ్యవహరించారని రోజా తాను దాఖలు చేసిన పిటీషన్‌లో ప్రస్తవించారు. తనను కించపరిచారని, బండారు సత్యనారాయణమూర్తితో పాటు మరి ఇద్దరిపై ఈ పరువు నష్టం దావా వేశారు. అందుకు తగిన ఆధారాలు కూడా రోజా తరఫున న్యాయవాదులు న్యాయస్థానానికి సమర్పించారు.

Tags:
Next Story
Share it