Chilakaluripeta: 17 న జరగబోయే టీడీపీ - జనసేన బహిరంగ సభకి మోడీ డుమ్మా!

ఈ నెల 17 వ తారీఖున తెలుగు దేశం , జనసేన పార్టీలు ఉమ్మడిగా కలిసి చిలకలూరిపేట లో భారీ బహిరంగ సభ ని ఏర్పాటు చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ సభకి కనీసం 10 లక్షల మంది జనాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు టీడీపీ, జనసేన నాయకులు.

Chilakaluripeta: 17 న జరగబోయే టీడీపీ - జనసేన బహిరంగ సభకి మోడీ డుమ్మా!
X

న్యూస్ లైన్,చిలకలూరిపేట : ఈ నెల 17 వ తారీఖున తెలుగు దేశం , జనసేన పార్టీలు ఉమ్మడిగా కలిసి చిలకలూరిపేట లో భారీ బహిరంగ సభ ని ఏర్పాటు చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఈ సభకి కనీసం 10 లక్షల మంది జనాలు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు టీడీపీ, జనసేన నాయకులు. ఈ సభలోనే ఎన్నికలకు సంబంధించిన మ్యానిఫెస్టో ని కూడా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ సభకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు ఇటీవలే తెలియచేసారు. కానీ ఇప్పుడు మోడీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది.

ఇప్పటికే నరేంద్ర మోడీ తెలంగాణ ఎంపీ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ కి చేరుకున్నారు. కాసేపట్లోనే ఆయన మల్కాజ్ గిరిలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ షెడ్యూల్ లోనే 17 వ తేదీ టీడీపీ, జనసేన సభకి విచ్చేస్తున్నారని టాక్ నడిచింది. అయితే ఈ సభ ని బీజేపీ పార్టీ టీడీపీ, జనసేన కూటమి తో కలవకముందు ప్లాన్ చేసింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో బీజేపీ జన సమీకరణ కోసం ఎలాంటి ప్లానింగ్ చెయ్యలేదని, అందుకే ఈ సభ కాకుండా మూడు పార్టీలు సంయుక్తంగా కలిసి త్వరలోనే ఏర్పాటు చేసే సభలో ప్రధానమంత్రి మోడీ పాల్గొంటారని, బీజేపీ పోటీ చెయ్యబోతున్న 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాల్లో పర్యటిస్తారని ఈ సందర్భంగా చెప్పుకొస్తున్నారు బీజేపీ నాయకులు.

Tags:
Next Story
Share it