Muddaraboina Venkateswara Rao: మీకు మీ పార్టీకి ఓ గుడ్ బై అంటూ.. టీడీపీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై

ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది.

Muddaraboina Venkateswara Rao: మీకు మీ పార్టీకి ఓ గుడ్ బై అంటూ.. టీడీపీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై
X

Muddaraboina Venkateswara Rao: ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. టీడీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్‌చార్జిగా వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధిని నియమించిన వేళ.. తెలుగుదేశం పార్టీకి మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు గుడ్‌బై చెప్పారు. ఈ క్రమంలోనే టీడీపీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలను తన కార్యాలయంలో నుంచి తీసేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.. అయితే వైసీపీలో చేరేది లేదని.. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.

టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. మీకు, మీ పార్టీకి పాదాభివందనం అంటూ మీడియా ముందు చెప్పారు.. ఆ పార్టీ అధినేత ఇంకా టీడీపీ కండువా కప్పుకోలేదు.. కానీ, ప్రకటించడంపై మండిపడ్డారు. పార్ధసారథి ఇంకా టీడీపీ కండువా కప్పుకోలేదు.. కానీ, పార్టీ నూజివీడు ఇంఛార్జ్‌గా ప్రకటించారు అంటూ మండిపడ్డారు.. ఉరిశిక్ష వేసే ముందు.. కోర్టులో న్యాయమూర్తి ఆఖరి కోరిన అడుగుతారు.. కానీ, నన్ను పార్టీ అడగలేదు అనే వాపోయారు. త్వరలో రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటానన్న ఆయన.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టు నేనేమైనా చెప్పానా? అని ప్రశ్నించారు. సీఎంవోలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కలిసి పలు అంశాలపై చర్చించాను.. ముఖ్యమంత్రిని ఎవరైనా కలవచ్చు కదా? అని నిలదీశారు. ఇక, స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసే అంశంతో సహా అన్ని విషయాలపై త్వరలోనే క్లారిటీ ఇస్తాను అని తెలిపారు. కానీ, పదేళ్లు నన్ను వాడుకుని బయటకు గెంటేశారు అంటూ మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు టీడీపీపై ధ్వజమెత్తారు

Tags:
Next Story
Share it