Mudragada: వైసీపీ పార్టీలోకి ముద్రగడ..జగన్ స్కెచ్ ఇదే !

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Pradmanabham) పొలిటికల్‌ రీ-ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌ అయినట్లు సమాచారం అందుతోంది. మరికాసేపట్లో

Mudragada: వైసీపీ పార్టీలోకి ముద్రగడ..జగన్ స్కెచ్ ఇదే !
X

Mudragada Pradmanabham: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం (Mudragada Pradmanabham) పొలిటికల్‌ రీ-ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్‌ అయినట్లు సమాచారం అందుతోంది. మరికాసేపట్లో ముద్రగడ ఇంటికి మిథున్ రెడ్డి టీమ్‌ వెళ్లనుంది. జిల్లా పార్టీ నేతలతో కలిసి కిర్లంపూడి ముద్రగడ నివాసానికి ఎంపీ మిథున్‌రెడ్డి వెళ్లనున్నారు. ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించేందుకు నేరుగా కిర్లంపూడికి వైసీపీ బృందం వెళ్లనుంది. అటు ముద్రగడ వైసీపీలో చేరితే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఉత్కంఠ నెలకొంది.

లేదంటే పోటీకి దూరంగా ఉంటూ వైసీపీకి (YCP) సపోర్ట్ గా పనిచేసే అవకాశం ఉన్నట్లు కూడా చెబుతున్నారు. ముద్రగడ (Mudragada Pradmanabham) కుమారుడు గిరికి ఎలక్షన్ కోడ్ రాకముందే నామినేటెడ్ పదవి హామీ ఇచ్చి..ఎన్నికల తర్వాత ముద్రగడకి తగిన పదవి ఉంటుందని హామీ ఇచ్చే దిశగా వైసీపీ పావులు కదుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. మిథున్ రెడ్డి తో పాటు జిల్లా వైసీపీ టీమ్ మంత్రి దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యేలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ మంత్రి తోట నరసింహం, ఎంపీ వంగా గీతా, జక్కంపూడి రాజా, చలమలశెట్టి సునీల్, పలువురు వైసీపీ నేతలు ముద్రగడ ఇంటికి వెళ్లనున్నారు. ముద్రగడతో వైసీపీ నేతల భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags:
Next Story
Share it