Mudragadda : ఈ నెల 12న వైసీపీ లోకి ముద్రగడ్డ చేరిక!

జనసేన పార్టీ కి మద్దతుదారులుగా వ్యవహరించిన కాపు పెద్దలలో ఒకరు ముద్రగడ్డ పద్మనాభం. నిన్న మొన్నటి వరకు ఈయన జనసేన పార్టీ లో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

Mudragadda : ఈ నెల 12న వైసీపీ లోకి ముద్రగడ్డ చేరిక!
X

న్యూస్ లైన్, అమరావతి : జనసేన పార్టీ కి మద్దతుదారులుగా వ్యవహరించిన కాపు పెద్దలలో ఒకరు ముద్రగడ్డ పద్మనాభం. నిన్న మొన్నటి వరకు ఈయన జనసేన పార్టీ లో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కి తక్కువ సీట్లు తీసుకోవడం, తన సలహాలను పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడం వంటివి ముద్రగడ్డ పద్మనాభం మనసుని గాయపరిచాయి. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ తన ఇంటికి వస్తానని ఎప్పుడో చెప్పారని, కానీ అతన్ని రానివ్వకుండా అడ్డుకుంటుంది ఎవరో నాకు తెలుసునని రీసెంట్ గా ఒక లేఖలో ప్రస్తావించారు ముద్రగడ్డ పద్మనాభం.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే, ఆయన వైసీపీ లో చేరడానికి సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది. నేడు వైసీపీ ముఖ్య నాయకులూ ముద్రగడ్డ పద్మనాభం ఇంటికి వెళ్లారు. అక్కడ కాసేపు సుదీర్ఘ చర్చలు జరిపిన తర్వాత ఒక శుభ ముహూర్తం చూసుకొని వైసీపీ లో చేరుతానని మీడియా కి తెలిపారు. అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ఈ నెల 12 వ తారీఖున వైసీపీ లో చేరబోతున్నట్టు తెలుస్తుంది.ముద్రగడ్డ పద్మనాభం కానీ, లేదా ఆయన కొడుకు కానీ పిఠాపురం స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారట. పిఠాపురం స్థానం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నట్టు గత కొంతకాలం నుండి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ముద్రగడ్డ పద్మనాభం అక్కడి నుండి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గెలుపు అవకాశాలు తగ్గుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:
Next Story
Share it