Tadepalli : సీఎం కార్యాలయంలో కంటైనర్ వివాదంపై వీడిన మిస్టరీ

టీడీపీ జనసేన పార్టీ క్యాడర్, నాయకులూ సీఎం జగన్ తుమ్మినా దగ్గినా భయపడిపోతున్నారు. పార్టీ కి సంబంధించి ఏ చిన్న కదలిక జరిగిన ఎదో కుట్ర చేస్తున్నారు అని జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Tadepalli : సీఎం కార్యాలయంలో కంటైనర్ వివాదంపై వీడిన మిస్టరీ
X

న్యూస్ లైన్,తాడేపల్లి: టీడీపీ జనసేన పార్టీ క్యాడర్, నాయకులూ సీఎం జగన్ తుమ్మినా దగ్గినా భయపడిపోతున్నారు. పార్టీ కి సంబంధించి ఏ చిన్న కదలిక జరిగిన ఎదో కుట్ర చేస్తున్నారు అని జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్ గా సీఎం జగన్ ఉండే తాడేపల్లి సీఎం కార్యాలయం లో ఒక కంటైనర్ వచ్చిందట. ఈ కంటైనర్ ని చూసి టీడీపీ, జనసేన శ్రేణులు వణికిపోయాయి. ఆ కంటైనర్ లో ఫేక్ ఈవీఎం మెషిన్స్ ఉన్నాయని కొందరు, కాదు డబ్బులు ఉన్నాయని మరికొందరు రచ్చ చేసారు. అయితే దీనిపై స్పందించిన వైసీపీ నాయకులు అసలు ఆ కంటైనర్ లో ఏముందో తెరిచి చూపించారు. అది కంటైనర్ కాదని, ప్యాంట్రీ కారు అని, సీఎం జగన్ బస్సు యాత్ర నేపథ్యంలో ఆహారాన్ని తయారు చేసుకునేందుకు ఈ పాంట్రీ వ్యాన్ ని ఏర్పాటు చేసినట్టుగా చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. దీంతో ఆ కంటైనర్ లో ఎదో ఉందని రచ్చ చేసిన టీడీపీ, జనసేన వాళ్ళు ఎప్పటి లాగానే ఫూల్స్ అయ్యారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఆ కంటైనర్ లో ఏమున్నయ్యో మీ కళ్ళతో మీరే చూసేయండి.



Tags:
Next Story
Share it