Chandrababu Naidu :వెలవెలబోతున్న చంద్రబాబు 'రా..కదలిరా' బహిరంగ సభలు..!

చంద్రబాబు నాయుడు 'రా కదలిరా' సభలకు హాజరు కానీ జనం..అభ్యర్థులపై బాబు సీరియస్.

Chandrababu Naidu :వెలవెలబోతున్న చంద్రబాబు రా..కదలిరా బహిరంగ సభలు..!
X

Newsline, Kanigiri : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం ఇప్పటి నుండే ప్రారంభం అయ్యింది. ఎన్నికల సంఘం కి సంబంధించిన అధికారులు కూడా ఆంధ్ర ప్రదేశ్ లో త్వరలోనే పర్యటన చేపట్టబోతున్నారని, ఓటర్ల జాబితా ని పరిశీలించబోతున్నారని అధికారికంగా ఖరారు అయ్యింది. ఆరు దశల్లో దేశ వ్యాప్తంగా జరగబోతున్న ఈ పోలింగ్ లో, మొదటి దశలోనే ఆంధ్ర ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు సమాచారం. ఫిబ్రవరి మొదటి వారం లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక రాజకీయ పార్టీలు ఇప్పటి నుండే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేసింది. తెలుగు దేశం పార్టీ రీసెంట్ గానే 'రా..కదలిరా' అనే కార్యక్రమం ని కనిగిరి నియోజకవర్గం నుండి ప్రారంభించింది. మొత్తం మీద 22 పార్లమెంట్ పరిధి స్థానాల్లో ఈ నెల ఏకంగా 22 బహిరంగ సభలను చంద్రబాబు నాయుడు నిర్వహించబోతున్నాడు. ఈ సభలలో కొన్నిటికి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కాబోతున్నాడు.

అయితే టీడీపీ నిర్వహించిన మొదటి సభ కనిగిరి లో అట్టర్ ఫ్లాప్ అయ్యింది. పాపం చంద్రబాబు నాయుడు నిన్న ఖాలీ కుర్చీలకు ఉపన్యాసం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనిగిరి ప్రాంతం తెలుగు దేశం కి అడ్డా అని అందరూ అంటుంటారు. అలాంటి చోటనే ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఇక ఇతర ప్రాంతాలలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే చంద్రబాబు ఉపన్యాసాలను వినడానికి ప్రత్యేకించి జనాలు ఎవ్వరూ కూడా బహిరంగ సభలకు రారు. ఆ ప్రాంతానికి సంబంధించిన తెలుగు దేశం పార్టీ అభ్యర్థి పైనే జనాల సమీకరణ ఆధారపడి ఉంటుంది. డబ్బులు బాగా ఖర్చు చెయ్యాల్సి ఉంటుంది, కానీ ఈసారి మాత్రం టీడీపీ ఎమ్యెల్యే అభ్యర్థులు డబ్బులను ఖర్చు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ. కారణం ఇంకా అభ్యర్థుల జాబితా ఖరారు కాకపోవడమే. సీట్ ఖరారు కానప్పుడు ఎందుకు అనవసరం గా అప్పు చేసి మరీ డబ్బులు ఖర్చు పెట్టాలి అనేది టీడీపీ అభ్యర్థుల నుండి వినిపిస్తున్న మాట. చంద్రబాబు కనిగిరి సభ అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇదే అని అంటున్నారు.

Tags:
Next Story
Share it