Atchannaidu : ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మాతృవియోగం

ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబంలో విషాదం నెలకొంది.

Atchannaidu : ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మాతృవియోగం
X

Atchannaidu : ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కుటుంబంలో విషాదం నెలకొంది. అచ్చెన్నాయుడు తల్లి కళావతమ్మ తుది శ్వాస విడిచారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. అచ్చెన్నాయుడుగారి మాతృమూర్తి కళావతమ్మ మృతికి సంతాపం తెలుపుతున్నట్లు వెల్లడించారు. అమ్మగారి మరణం కింజరాపు కుటుంబానికి తీరని లోటన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కళావతమ్మకు కన్నీటి నివాళులు అర్పించిన నారా లోకేష్ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Tags:
Next Story
Share it