Nara Lokesh : ఇన్నర్ రింగ్ రోడ్ కేసు.. ఏపీ హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్

తెలుగు దేశం పార్టీ అధినేతలకు గడ్డు కాలం నడుస్తోంది.

Nara Lokesh : ఇన్నర్ రింగ్ రోడ్ కేసు.. ఏపీ హైకోర్టులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్
X

న్యూస్ లైన్, Nara Lokesh : తెలుగు దేశం పార్టీ అధినేతలకు గడ్డు కాలం నడుస్తోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు పలు ఆరోపణల నేపథ్యంలో జైల్లో ఉన్నారు. తర్వాత ప్రస్తుతం ఆయన కొడుకు నారా లోకేష్ పై కూడా ఆరోపణలు మొదలయ్యాయి. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ పేరును ఏ14గా సీఐడీ అధికారులు చేరుస్తూ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. దీంతో అప్రమత్తమైన నారా లోకేష్ ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతే కాకుండా ఈ కేసుతో తనకేం సంబంధం లేదని కేవలం రాజకీయంగా దెబ్బ తీయాలన్న ఉద్దేశంతోనే తనను ఈ కేసులో ఇరికించారని వాపోయాడు. ఇది ఇలా ఉంటే నారా లోకేష్ యువగళం పాదయాత్ర 29వ తేదీ నుంచి మళ్లీ ప్రారంభించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాదయాత్రకు హాజరు కాకుండా అరెస్ట్ చేసేందుకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆయన పేరు చేర్చారని టీడీపీ నేతలు అనుమానపడుతున్నారు. అందుకనే పాదయాత్రలో ఎలాంటి ఆటంకం జరుగకుండా నారా లోకేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్‌ పేరును ఏ14గా చేర్చి విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఇప్పటికే చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ పలువురిని సీఐడీ నిందితులుగా పేర్కొంది. రాజధాని మాస్టర్ ప్లాన్ , ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ రూపకల్పన ఆమోదంలో.. చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేష్‌, నారా లోకేష్‌, అందరూ కలిసి వారి అనుచరులకు లబ్ధి చేకూరేలా వారి భూములకు భారీ రేట్లు వచ్చేలా కుట్రలు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఇన్నర్‌రింగ్‌ రోడ్‌ అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి నారా లోకేష్‌ లబ్ధి పొందాలని ప్రయత్నించినట్లు సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ కేసులో ఇప్పటికే పలువురికి ముందస్తు బెయిల్ లభించింది. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరగాల్సి ఉంది.

Tags:
Next Story
Share it