Mangalagiri : మంగళగిరి లో ఇంటింటికి లోకేష్ మేనిఫెస్టో కరపత్రాలు!

ఎన్నికల కోడ్ అమలు అయినా ఈ నేపథ్యం లో రాజకీయ పార్టీలు నిబంధలు విరుద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు చెయ్యకూడదు. కానీ తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకులు నారా లోకేష్ ఎన్నికల కోడ్ నియమాలను అతిక్రమించే ప్రయత్నం చేసారు.

Mangalagiri : మంగళగిరి లో ఇంటింటికి లోకేష్ మేనిఫెస్టో కరపత్రాలు!
X

న్యూస్ లైన్,మంగళగిరి : ఎన్నికల కోడ్ అమలు అయినా ఈ నేపథ్యం లో రాజకీయ పార్టీలు నిబంధలు విరుద్ధంగా ఎలాంటి కార్యక్రమాలు చెయ్యకూడదు. కానీ తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకులు నారా లోకేష్ ఎన్నికల కోడ్ నియమాలను అతిక్రమించే ప్రయత్నం చేసారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నారాలోకేష్ తాను పోటీ చెయ్యబోయే మంగళగిరి నియోజకవర్గం లో కూటమి యొక్క మ్యానిఫెస్టోను ఇంటింటికి పంపడానికి టీడీపీ బృందం తో కలిసి ప్లాన్ చేసారు. చెన్నై నుండి డైరెక్ట్ పోస్టు ద్వారా 1,80,000 మేనిఫెస్టో పత్రాలను పోస్ట్ చేసారు లోకేష్. అయితే ఈ మేనిఫెస్టో పాత్రలలో టీడీపీ -జనసేన కూటమికి సంబంధించిన లోగో ఉంది కానీ, పొత్తులో ఉన్న బీజేపీ పార్టీ సింబల్ ని వేయకపోవడం గమనార్హం. ఎన్నికల కోడ్ కావడంతో 1,80,000 వేల మేనిఫెస్టో కాపీలను పంపిణీ చేయకుండా పోస్టల్ శాఖ అధికారులు నిలిపి వేశారు. ఎన్నికల అధికారులకు ఈ విషయం గురించి సమాచారం అందిస్తామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి పరిస్థితులంటున్న మంగళగిరి హెడ్ పోస్టాఫీసు అధికారులు ఈ సందర్భంగా తెలిపారు.

Tags:
Next Story
Share it