CM Jagan: గుడ్‌న్యూస్‌ చెప్పిన జగన్.. నేడు వారి ఖాతాల్లో డబ్బులు

ఏపీలోని (AP) నిరు పేదలకు గుడ్‌ న్యూస్‌. నవరత్నాలు పేదలందరికి ఇళ్లు లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్ మెంట్ డబ్బులు చెల్లించనుంది

CM Jagan: గుడ్‌న్యూస్‌ చెప్పిన జగన్.. నేడు వారి ఖాతాల్లో డబ్బులు
X

CM Jagan : ఏపీలోని (AP) నిరు పేదలకు గుడ్‌ న్యూస్‌. నవరత్నాలు పేదలందరికి ఇళ్లు (Navaratnalu Pedalandariki Illu Scheme) లబ్ధిదారులకు వడ్డీ రీయింబర్స్ మెంట్ డబ్బులు చెల్లించనుంది జగన్‌ సర్కార్‌. ఇళ్ళ నిర్మాణానికి బ్యాంకులు 9 నుంచి 11 శాతం వడ్డీతో రుణాలు ఇస్తారు. మహిళల పై భారం పడకుండా పావలా వడ్డీకే ఆ రుణాలు ప్రభుత్వం అందిస్తోంది. ఇందులో భాగంగా 12.77 లక్షల మందికి 4,500.19 కోట్ల రూపాయలను బ్యాంకు రుణం అందించింది ఏపీ సర్కార్‌.

వీరిలో అర్హులైన 4,07,323 మంది లబ్ధిదారులకు ఇవాళ వడ్డీ రీఎంబర్స్ మెంట్ ఇవ్వనుంది. ఈ తరుణంలోనే.. 46.90 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో వర్చువల్ గా జమ చేయనున్నారు సీఎం వై.ఎస్. జగన్. (CM Jagan) సంవత్సరంలో రెండు సార్లు వడ్డీ రీఎంబెర్స్‌మెంట్ ఇస్తున్నారు. ఇక ఇవాళ ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరుగనుంది.

Tags:
Next Story
Share it