Kurnool: కర్నూలు జిల్లాలో వింత ఆచారం !

ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం ఉంటుంది. అది కొత్త వారికి వింతగా అనిపిస్తుంది. కానీ ఎక్కడి ఆచారాలే..అక్కడే అమలు చేస్తారు. అయితే.. కర్నూలు జిల్లాలో వింత ఆచారం తెర

Kurnool: కర్నూలు జిల్లాలో వింత ఆచారం !
X

Kurnool: ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం ఉంటుంది. అది కొత్త వారికి వింతగా అనిపిస్తుంది. కానీ ఎక్కడి ఆచారాలే..అక్కడే అమలు చేస్తారు. అయితే.. కర్నూలు జిల్లాలో వింత ఆచారం తెరపైకి వచ్చింది. మగవారు మగువలగా మారి రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. హొలీ పండుగ వచ్చిందంటే మనకు రంగులు గుర్తుకు వస్తాయి.

అయితే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్ళురు గ్రామంలో మాత్రం ఈ హొలీ పండుగను విచిత్ర వేష ధారణలతో మగవారు ఆడవారి వేషధారణలో అలంకరించుకొని రతి మన్మధులకు పూజలు జరుపుకోని మొక్కులు తీర్చడం.. ఇక్కడ వారి సంప్రదాయంగా మారిపోయింది. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుల్లూరు గ్రామంలో హొలీ పండగ వచ్చిందంటే ఆ గ్రామంలో ఈ హొలీ పండుగ రోజు మగవాళ్ళు చీర కట్టుకొని, బంగారు ఆభరణాలు వేసుకొని ముస్తాబవుతారట.

ఇది వారి తాత, ముత్తాతల నుంచి వస్తున్న ఆచారం. అనుకున్న కోరికలు తీరితే మగవారు ఆడవాళ్ల మాదిరి ముస్తాబై పిండి వంటలు తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి "రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

Tags:
Next Story
Share it