Paritala Sriram : పరిటాల కుటుంబానికి ఈసారి టికెట్ దక్కడం కష్టమేనా..?

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పరిటాల శ్రీరామ్ కి టికెట్ దక్కడం కష్టమేనని రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్న చర్చ.

Paritala Sriram : పరిటాల కుటుంబానికి ఈసారి టికెట్ దక్కడం కష్టమేనా..?
X

Paritala Sriram, Andhra Pradesh : తెలుగు దేశం పార్టీ లో మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానం ఉన్న పరిటాల రవి కుటుంబం ఇప్పుడు కష్టాల్లో చిక్కుకుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరామ్ కొత్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు దేశం పార్టీ ఆయనకి రాప్తాడు నియోజకవర్గం బాధ్యతలను ఇవ్వాలనుకుంది. అక్కడి నుండే ఆయన్ని రాబొయ్యే సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేయించాలని అనుకుంది. కానీ శ్రీరామ్ అందుకు ఒప్పుకోలేదు. ధర్మవరం నియోజకవర్గానికి ఇంచార్జి పదవి ఒత్తిడి చేసి మరీ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఆ ప్రాంతం లో పరిటాల శ్రీరామ్ కి సొంత వర్గం నుండే అసమ్మతి సెగ తగులుతుంది. దీంతో ముందుగా టీడీపీ పార్టీ ఇవ్వాలనుకున్న రాప్తాడు నియోజకవర్గానికి వెనక్కి రాలేక, ఇటు ధర్మవరం నుండి పోటీ చెయ్యలేక తన రాజకీయ భవిష్యత్తుని సమస్యల్లోకి నెట్టుకున్నాడని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటంటే పరిటాల శ్రీరామ్ ఇప్పుడు పెనుకొండ నియోజకవర్గం నుండి పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ స్థానం నుండే గతం లో ఆయన తల్లిదండ్రులు పోటీ చేసి అసెంబ్లీ కి ఎన్నిక అయ్యారు. అయితే బీసీ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతం లో పరిటాల శ్రీరామ్ కి టికెట్ ఇవ్వడానికి టీడీపీ అధిష్టానం ఒప్పుకుంటుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు తెలుగు దేశం పార్టీ నుండి బీకే పార్థసారథి, సవితమ్మ మధ్య పోటీ నెలకొంది. ఇద్దరు బీసీ సామాజికవర్గం లో అత్యంత ఆదరణ ఉన్న అభ్యర్థులే. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ ఖరారు అనుకుంటున్న సమయం లో ఇప్పుడు పరిటాల శ్రీరామ్ ఇదే స్థానం నుండి పోటీ చెయ్యాలని అనుకోవడం పై టీడీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. దీంతో పరిటాల శ్రీరామ్ కి అసలు వచ్చే ఎన్నికలలో టికెట్ దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ ఆయనకీ టికెట్ దక్కకపోతే టీడీపీ లోనే కొనసాగుతాడా?, లేదా వైసీపీ కి వెళ్తాడా అనేది కూడా చూడాలి.

Tags:
Next Story
Share it