Kovur : కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థికి టీడీపీ మొండిచెయ్యి!

ఇటీవలే టీడీపీ, జనసేన కి సంబంధించిన 99 మంది ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాని విడుదల చేసారు. కానీ కొన్ని సమస్యపూరితమైన ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాని మాత్రం హోల్డ్ లో పెట్టింది. అందులో నెల్లూరు జిల్లా కోవూరు నిజయోజకవర్గం కూడా ఒకటి.

Kovur : కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థికి టీడీపీ మొండిచెయ్యి!
X

న్యూస్ లైన్, కోవూరు : ఎన్నికల సమయం దగ్గర పడేటప్పుడు ఒక పార్టీ నుండి మరో పార్టీ లోకి చేరికలు ఉండడం సర్వసాధారణమైన విషయం అనేది మన అందరికీ తెలిసిందే. అలా టీడీపీ, వైసీపీ మరియు జనసేన పార్టీలకు వలసలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక విషయం వైసీపీ పార్టీ ఒక పక్కా ప్రణాళికతో, ఎలాంటి అసంతృప్తి జ్వాలలు రాగలకుండా, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. కానీ టీడీపీ, జనసేన పార్టీలు గందరగోళ వైఖరిని ప్రదర్శిస్తుంది. ఇటీవలే టీడీపీ, జనసేన కి సంబంధించిన 99 మంది ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాని విడుదల చేసారు. కానీ కొన్ని సమస్యపూరితమైన ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాని మాత్రం హోల్డ్ లో పెట్టింది. అందులో నెల్లూరు జిల్లా కోవూరు నిజయోజకవర్గం కూడా ఒకటి.

ఈ నియోజకవర్గం నుండి టీడీపీ మాజీ ఎమ్మెల్యే పొలం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి కుమారుడు పొలంరెడ్డి దినేష్ రెడ్డి పోటీ ఎమ్మెల్యే టికెట్ ని ఆశిస్తున్నారు. ఇప్పటికే ఆయన కోవూరు పట్టణం మొత్తం ఇంటింటికి వెళ్లి ప్రచారం చెయ్యడం కూడా మొదలు పెట్టేసారు. కానీ ఈ స్థానం ఆయనకీ దక్కడం కష్టమేనని లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త. పూర్తి వివరాల్లోకి వెళ్తే నెల్లూరు వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రీసెంట్ గానే తెలుగు దేశం పార్టీ లో చేరిన సంగతి మన అందరికి తెలిసిందే. ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి ఆయన తెలుగు దేశం పార్టీ తరుపున టికెట్ ఇప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కోవూరు నియోజకవర్గం టికెట్ ని ప్రశాంతి రెడ్డి కి ఇవ్వనున్నారని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. అదే కనుక జరిగితే పోలంరెడ్డి దినేష్ రెడ్డి పార్టీ కి రాజీనామా చేసే అవకాశం కూడా ఉందని అంటున్నారు. రాబొయ్యే రెండు మూడు రోజుల్లోనే ఈ నియోజకవర్గం గురించి క్లారిటీ రానుంది.

Tags:
Next Story
Share it