Roja : రోజా భర్త సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ !

ఏపీ మంత్రి ఆర్కే రోజా భర్త, ప్రముఖ దర్శకుడు సెల్వమణికి చెన్నైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

Roja :  రోజా భర్త సెల్వమణిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ !
X


Roja : ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా భర్త సెల్వమణికి ఊహించని షాక్‌ తగిలింది. ఏపీ మంత్రి ఆర్కే రోజా భర్త, ప్రముఖ దర్శకుడు సెల్వమణికి చెన్నైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చెన్నై టౌన్ కోర్టు ఈ వారెంట్ జారీ చేసింది. ఒక పరువు నష్టం కేసులో సెల్వమణి కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆయనకు నాన్ బెయిలబుల్ వారింట్ జారీ అయింది.

2016లో దర్శకుడు ఆర్కే సెల్వమణి కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే అరుణ్ అన్నరసుతో కలిసి ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో తన పరువు భంగం కలిగేలా సెల్వమణి వాక్యాలు చేశారంటే ప్రముఖ సిని ఫైనాన్షియర్ ముకుంద్ చంద్ బోత్ర జార్జి టౌన్ కోర్టులో దావా వేశారు.

ఈ కేసు విచారణకు సెల్వమణి, ఆయన తరపు న్యాయవాది గైర్హాజరయ్యారు. దీంతో కోర్టు సెల్వమణికి అరెస్టు వారెంట్ జారీ చేసింది. కోటు నాన్ వెయ్యిలబుల్ వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో అరెస్టు నుండి తప్పించుకోవాలంటే తప్పకుండా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.ఇక ఈ కేసుపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:
Next Story
Share it