ICET - 2024 : ICET పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల!

ఆంధ్ర ప్రదేశ్ లోని ఎంబీఏ/ఎంసీఏ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ICET - 2024 పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ ని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ కాసేపటి క్రితమే విడుదల చేసింది.

ICET - 2024 : ICET పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల!
X

న్యూస్ లైన్, అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లోని ఎంబీఏ/ఎంసీఏ విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ICET - 2024 పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ ని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ కాసేపటి క్రితమే విడుదల చేసింది. విద్యార్థులు ఈ నెల 6 వ తేదీ నుండి, వచ్చే నెల 7 వ తారీఖు వరకు ఎలాంటి జరిమానా లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 6 , 7 తేదీలలో రెండు సెషన్స్ లో ఈ పరీక్షలను నిర్వహించబోతున్నారు. ఇక ఈ పరీక్ష దరఖాస్తులకు అయ్యే ఫీజులను ఒకసారి పరిశీలిస్తే, ఓసి క్యాటగిరీ కి సంబంధించిన విద్యార్థులకు 650 రూపాయిలు, బీసీ విద్యార్థులకు 600 రూపాయిలు, అలాగే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 550 రూపాయిలు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియచేయనున్నారు. గత ఏడాది జరిగిన ICET పరీక్షలకు 44,343 విద్యార్థులు హాజరయ్యారు. ఈసరి 80 వేల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.

Tags:
Next Story
Share it