Pensions : పెన్షన్ కోసం వెళ్లి వృద్ధురాలు మృతి!

ఆంధ్ర ప్రదేశ్ లో పెన్షన్స్ ని వాలంటీర్ల చేత అందించకూడదని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చెయ్యడంతో, వాలంటీర్లు విధుల నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

Pensions : పెన్షన్ కోసం వెళ్లి వృద్ధురాలు మృతి!
X

న్యూస్ లైన్, పెనమలూరు: ఆంధ్ర ప్రదేశ్ లో పెన్షన్స్ ని వాలంటీర్ల చేత అందించకూడదని ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చెయ్యడంతో, వాలంటీర్లు విధుల నుండి తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో వృద్దులు, వికలాంగులు ఈ నిటారు ఎండల్లో సచివాలయాల వద్ద క్యూలైన్స్ లో గంటల తరబడి నిల్చొని పెన్షన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎండ తీవ్రత తట్టుకోలేక వృద్దులు పలు చోట్ల ప్రాణాలను విడుస్తున్నారు. ఈరోజు కృష్ణ జిల్లాలో అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే కృష్ణ జిల్లా లోని పెనమలూరు మండలం, గంగూరు గ్రామం లో వజ్రమ్మ అనే 80 ఏళ్ళ వృద్ధురాలు పెన్షన్ కోసం గ్రామసచివాలయం కి వెళ్లి వడదెబ్బ తగిలి ప్రాణాలను విడిచింది. దీంతో ఆమె కుటుంబాన్ని పరామర్శించేందుకు మంత్రి జోగి రమేష్, అలాగే టీడీపీ నేత బోడె ప్రసాద్ ఒకే సమయం లో వెళ్లారు. చంద్రబాబు నాయుడు వృద్ధుల మీద చేసిన కుట్ర వల్లనే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి, అన్యాయం గా ఇలా ఎంతో మంది వృద్దులని పొట్టన పెట్టుకుంటున్నాడు అంటూ జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు సంచలనం గా మారాయి.

Tags:
Next Story
Share it