Pensions : పెన్షన్ కోసం శ్రీకాకుళం వెళ్లి మరణించిన వృద్ధురాలు!

పెన్షన్స్ కోసం వృద్దులు నిటారు ఎండల్లో కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి, గంటల తరబడి ఆ ఎండల్లో క్యూ లైన్స్ లో నిల్చొని ఒకప్పుడు కష్టాలు పడేవారు. ఆ కష్టాలన్నీ పాదయాత్ర ద్వారా చూసి చలించిపోయిన సీఎం జగన్, వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేసి, ప్రభుత్వానికి సంబంధించిన అన్నీ కార్యక్రమాలు వాలంటీర్ల ద్వారా చేయిస్తూ వచ్చారు.

Pensions : పెన్షన్ కోసం శ్రీకాకుళం వెళ్లి మరణించిన వృద్ధురాలు!
X

న్యూస్ లైన్, వైజాగ్: పెన్షన్స్ కోసం వృద్దులు నిటారు ఎండల్లో కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి, గంటల తరబడి ఆ ఎండల్లో క్యూ లైన్స్ లో నిల్చొని ఒకప్పుడు కష్టాలు పడేవారు. ఆ కష్టాలన్నీ పాదయాత్ర ద్వారా చూసి చలించిపోయిన సీఎం జగన్, వాలంటీర్ వ్యవస్థని ఏర్పాటు చేసి, ప్రభుత్వానికి సంబంధించిన అన్నీ కార్యక్రమాలు వాలంటీర్ల ద్వారా చేయిస్తూ వచ్చారు. గడిచిన ఐదేళ్ళలో అవ్వ, తాతలు ఇంట్లో కూర్చొని పెన్షన్స్ తీసుకునే స్థాయికి వచ్చారు. సమాజం లో ఒక్క గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టారు జగన్. అయితే ఎన్నికల కోడ్ పేరిట చంద్రబాబు వాలంటీర్ల పై కేసు వెయ్యడంతో, కోర్టు వాలంటీర్లకు పెన్షన్స్ ని పంచే బాధ్యత నుండి వాలంటీర్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వృద్ధుల కష్టాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా ఉత్తరాంధ్ర ప్రాంతం లో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. వైజాగ్ నుండి పెన్షన్ కోసం శ్రీకాకుళం వెళ్లిన ఒక అవ్వ, ఎండ తాకిడి ని తట్టుకోలేక గుండెపోటుతో మరణించింది. ఈమె విశాఖ వెస్ట్ 57 వ వార్డు ఆస్వన్ పాలెం కి చెందిన ఆమెగా గుర్తుపట్టారు పోలీసులు. రాబొయ్యే రోజుల్లో ఇలాంటి వార్తలు ఇంకెన్ని వినాలో అని భయపడుతున్నారు జనాలు.

Tags:
Next Story
Share it