Janasena Party : జనసేన పార్టీ కి మరో కీలక నేత రాజీనామా..ఇది ఊహించని షాక్!

2019 ఎన్నికలలో ఘోర పరాజయం చూసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని నమ్మి కొంతమంది నాయకులూ ఆయనతో కలిసి నడిచి పార్తిని అభివృద్ధి చేసేందుకు ఎంతో కష్టపడ్డారు. అలాంటి నాయకులకు రాబొయ్యే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ సీటు ఇవ్వకపోవడం తో మనస్తాపానికి గురై రాజీనామాలు చేస్తున్నారు.

Janasena Party : జనసేన పార్టీ కి మరో కీలక నేత రాజీనామా..ఇది ఊహించని షాక్!
X

న్యూస్ లైన్ డెస్క్: 2019 ఎన్నికలలో ఘోర పరాజయం చూసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని నమ్మి కొంతమంది నాయకులూ ఆయనతో కలిసి నడిచి పార్తిని అభివృద్ధి చేసేందుకు ఎంతో కష్టపడ్డారు. అలాంటి నాయకులకు రాబొయ్యే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ సీటు ఇవ్వకపోవడం తో మనస్తాపానికి గురై రాజీనామాలు చేస్తున్నారు. ఇటీవలే ముమిడివరం జనసేన పార్టీ ఇంచార్జి పితాని బాలకృష్ణ జనసేన పార్టీ కి రాజీనామా చేసి వైసీపీ లో చేరారు. ఇప్పుడు రీసెంట్ గా అమలాపురం జనసేన పార్టీ ఇంచార్జి శెట్టి బత్తుల రాజబాబు కూడా జనసేన పార్టీ కి రాజీనామా చేసారు. గడిచిన 5 ఏళ్లలో రాజబాబు తన సొంత ఖర్చులతో జనసేన పార్టీ ని అమలాపురం లో క్షేత్ర స్థాయి నుండి ఎంతో బలోపేతం చేసారు. సీటు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ సీటు రాకపోవడం తో నేడు ఆయన జనసేన పార్టీ కి రాజీనామా చేసారు. త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని మీడియా కి తెలిపారు. గత ఎన్నికలలో జనసేన పార్టీ కి అమలాపురం లో టీడీపీ తో సరిసమానంగా ఓట్లు వచ్చాయి. కానీ టీడీపీ పార్టీ జనసేన కి సీట్ ఇచ్చేందుకు నిరాకరించింది.

అమలాపురం కి బదులుగా పీ గన్నవరం సీటుని కేటాయించింది. దీంతో అప్పట్లో ఆగ్రహించిన జనసైనికులు పెద్ద ఎత్తున ధర్నాలు, నిరాహారదీక్షలు చేసారు. కానీ పవన్ కళ్యాణ్ నుండి ఎలాంటి స్పందన రాలేదు. కనీసం ఆయన్ని కలిసే అవకాశం కూడా రాకపోవడం తో ఇక పార్టీ కి రాజీనామా చెయ్యడమే సరైన నిర్ణయం అని శెట్టిబత్తుల రాజబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం రాజబాబు మాత్రమే కాదు, అతి తావరలోనే విజయవాడ పశ్చిమ జనసేన పార్టీ ఇంచార్జి పాతిన మహేష్ కూడా జనసేన పార్టీ కి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయి. విజయవాడ పశ్చిమ స్థానం లో జనసేన పార్టీ కోసం ఎంతో శ్రమించి ఆ పార్టీ ని ఆ నియోజకవర్గం లో తిరుగులేని శక్తిగా మలిచారు పోతిన మహేష్. సర్వేలలో కూడా పోతిన మహేష్ కి ఇస్తే తప్ప, ఆ స్థానం కూటమి గెలవడం కష్టం అని తేలినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఆ స్థానాన్ని బీజేపీ కి వదిలేయడం పోతిన మహేష్ కి ఏమాత్రం నచ్చలేదు. త్వరలోనే ఆయన కూడా తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

Tags:
Next Story
Share it