YCP : వైసీపీ కి రాజీనామా చేసిన ఎమ్మెల్యే!

ప్రకాశం జిల్లాలో వైసీపీ పార్టీ కి మరో కీలక నేత రాజీనామా చేసారు. ఇటీవలే ఆ జిల్లాలో వైసీపీ కి ఆయువుపట్టు లాగ నిలుస్తూ వచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేసి టీడీపీ లో చేరిన సంఘటన పెద్ద సంచలనం రేపిన విషయం మన అందరికీ తెలిసిందే.

YCP : వైసీపీ కి రాజీనామా చేసిన ఎమ్మెల్యే!
X

న్యూస్ లైన్,చీరాల: ప్రకాశం జిల్లాలో వైసీపీ పార్టీ కి మరో కీలక నేత రాజీనామా చేసారు. ఇటీవలే ఆ జిల్లాలో వైసీపీ కి ఆయువుపట్టు లాగ నిలుస్తూ వచ్చిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేసి టీడీపీ లో చేరిన సంఘటన పెద్ద సంచలనం రేపిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు పర్చూరు వైసీపీ పార్టీ ఇంచార్జి ఆమంచి కృష్ణ మోహన్ కూడా వైసీపీ పార్టీ కి రాజీనామా చేస్తున్నట్టుగా అధికారిక ప్రకటన చేసారు. వైసీపీ నుండి చీరాల ఎమ్మెల్యే టికెట్ ని ఆశించిన ఆమంచి కృష్ణ మోహన్ కి, ఆ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం తో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సీఎం జగన్ ప్రత్యేకంగా చేపట్టిన సర్వేలలో ఆమంచి కృష్ణ మోహన్ కి సానుకూల స్పందన రాకపోవడం వల్లే టికెట్ నిరాకరించారట. ఇకపోతే త్వరలోనే తన కార్యకర్తలతో చర్చలు జరిపి భవిష్యత్తు కార్యాచరణ తెలియచేస్తామని చెప్పుకొచ్చారు ఆమంచి కృష్ణ మోహన్. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆమంచి కృష్ణ మోహన్ చీరాల నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇది ఇలా ఉండగా ఆయన సోదరుడు ఆమంచి స్వాములు కూడా జనసేన పార్టీ లో చేరి, ఆ పార్టీ నుండి చీరాల ఎమ్మెల్యే గా పోటీ చెయ్యాలని అనుకున్నారు. కానీ టికెట్ రాకపోవడం తో ఇప్పుడు ఆయన కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయట. ఇలా ఆమంచి బ్రదర్స్ ఒకే నియోజకవర్గం నుండి పోటీ చెయ్యబోతుండడం ఆసక్తికరంగా మారింది. ప్రకాశం జిల్లాలో ఆమంచి బ్రదర్స్ కి ఏ రాజకీయ పార్టీ లోను టికెట్ రాకపోవడం వాళ్ళ అనుచరులను తీవ్రమైన మనస్తాపానికి గురి చేస్తుంది. చీరాలలో వీళ్లిద్దరు కలిసి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తే ఏ పార్టీ ఓట్లు చీలుతుందో, ఎవరు గెలుస్తారో అనే దానిపై నియోజకవర్గం లో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

Tags:
Next Story
Share it