Ongole : నేడు టీడీపీ లో చేరనున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి!

ప్రకాశం జిల్లాలో అత్యంత పవర్ ఫుల్ లీడర్ గా పేరు సంపాదించుకున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ పార్టీ కి రాజీనామా చేసి చాలా కాలం అయిన సంగతి తెలిసిందే.

Ongole : నేడు టీడీపీ లో చేరనున్న వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి!
X

న్యూస్ లైన్, ఒంగోలు : రాబొయ్యే రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు హోరాహోరీగా ఉండబోతున్నాయి. ఊహించిన విధంగానే టికెట్ దక్కని ఆశావహులు ఒక పార్టీ నుండి మరోపార్టీ కి జంప్ అవుతున్నారు. ఇకపోతే ప్రకాశం జిల్లాలో అత్యంత పవర్ ఫుల్ లీడర్ గా పేరు సంపాదించుకున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ పార్టీ కి రాజీనామా చేసి చాలా కాలం అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే టీడీపీ లో చేరబోతున్నానని అధికారిక ప్రకటన చేసిన ఆయన నేడు సాయంత్రం 4 గంటలకు చంద్రబాబు సమక్షంలో పసుపు కండువాని కప్పుకోనున్నారు. ఈసారి ఆయన ఎన్నికలకు దూరంగా ఉంటూ, తన కొడుకు రాఘవరెడ్డి ని తెలుగు దేశం పార్టీ నుండి ఒంగోలు ఎంపీ గా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ప్రకాశం జిల్లా మొత్తాన్ని ప్రభావితం చెయ్యగల సత్తా ఉన్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ పార్టీ ని వీడడం ఆ పార్టీ కి పెద్ద షాక్ అనే చెప్పాలి.

Tags:
Next Story
Share it