Ongole: చంద్రబాబుకు షాక్.. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ వెలసిన ఫ్లెక్సీలు

Ongole: ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్న

Ongole: చంద్రబాబుకు షాక్.. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ వెలసిన ఫ్లెక్సీలు
X

Ongole: ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో పొత్తులు, సీఎం ఎవరు అనేదానిపై జోరుగా ప్రచారం సాగుతోంది. అటు అధికార వైసీపీ పార్టీ సైతం టిడిపిని పక్కకు పెట్టి జనసేన పైనే ఫోకస్ చేస్తుంది. ఇలాంటి సందర్భంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో టిడిపి అధినేత నారా చంద్రబాబుకు ఓ షాక్ తగిలింది. ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. నెక్స్ట్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అంతేకాదు ఆ ఫ్లెక్సీ ల కింద.. "ఆసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే" అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి.

అయితే ఈ ఫ్లెక్సీ లలో చంద్రబాబు ఫోటోలు కూడా ఉండడం గమనార్హం. దీంతో ఈ ఫ్లెక్సీలు ఎవరిని ఉద్దేశించి ఏర్పాటు చేశారనే చర్చ జోరుగా సాగుతుంది. వీటిని ఎవరు ఏర్పాటు చేశారని ఆరా తీస్తున్నారు టీడీపీ నేతలు. మరోవైపు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జరుగుతుంది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు చంద్రబాబుకి షాక్ ఇచ్చారు.

Tags:
Next Story
Share it