YCP: వైసీపీకి ఎంపీ మాగుంట రాజీనామా

వైసీపీకి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ...ఎంతో బాధతో పార్టీకి రాజీనామా

YCP: వైసీపీకి ఎంపీ మాగుంట రాజీనామా
X

YCP: వైసీపీకి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ...ఎంతో బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నా..త్వరలో రాజకీయ భవితవ్యంపై నిర్ణయం ఉంటుందన్నారు. అన్నీ విషయాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. మాగుంట కుటుంబం 34 ఏళ్లుగా ఒంగోలులో రాజకీయాలు చేస్తోందని...మాగుంట కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ప్రజలు అక్కున చేర్చుకున్నారని వెల్లడించారు.

ప్రకాశం జిల్లా వాసులను కుటుంబ సభ్యులుగా భావిస్తూ వస్తున్నాం..మాగుంట కుటుంబానికి, ప్రజలకు అవినాభావ సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ 33 ఏళ్ళలో 8 సార్లు పార్లమెంట్ కి, ఒకసారి ఎమ్మెల్సీగా పోటీ చేశామని గుర్తు చేశారు. మా కుటుంబం కోరుకునేది కేవలం గౌరవం..మాకు ఇగోలు లేవన్నారు. రాబోయే ఎన్నికల్లో మా కుటుంబం ఓ నిర్ణయం తీసుకుంది..మా కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీలో ఉంచాలని నిర్ణయించామని తెలిపారు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల్లో వైసీపీని వీడాలనుకుంటున్నామని చెప్పారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి.

Tags:
Next Story
Share it