BRS: సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మా రావు గౌడ్ ?

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో మే 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో

BRS: సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మా రావు గౌడ్ ?
X

Padma Rao Goud: పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వస్తున్న సంగతి తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాలలో మే 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు ఎంపీ అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా మూడు పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో... ఓటమిపాలైన గులాబీ పార్టీ మాత్రం... ఇప్పుడు మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. ఈ మేరకు గెలుపు గుర్రాలను ఎంపీ బరిలో ఉంచుతున్నారు కేసీఆర్.

అయితే.. తెలంగాణకు ఆయువు పట్టువైన సికింద్రాబాద్ ఎంపీ సీటు కైవసం చేసుకునేందుకు KCR వ్యూహ రచనలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ ను రంగంలోకి దింపేందుకు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్ణయం తీసుకున్నారట. మొదట తలసాని కొడుకుకు ఈ టికెట్ ఇవ్వాలని అనుకున్నారట. కానీ చివరి క్షణంలో పద్మారావు గౌడ్ పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఎలాగైనా సికింద్రాబాద్ స్థానాన్ని గెలుచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారట కేసీఆర్.

Tags:
Next Story
Share it