RUDRAKARAN: ఏపీ రాజకీయాలపై రుద్రకరణ్ జోస్యం ఏంటి.ఏ పార్టీ గెలుస్తుంది!

ఏపీ ( AP) ఎన్నికల రాజకీయం చాలా హీట్ లో ఉంది. అన్ని పార్టీలు వారి వారి ప్రయత్నాలు చేస్తున్నాయి. చాలా సర్వేలు ..రాజకీయ వాదోపవాదాలు నడుస్తున్నాయి.

RUDRAKARAN: ఏపీ రాజకీయాలపై రుద్రకరణ్ జోస్యం ఏంటి.ఏ పార్టీ గెలుస్తుంది!
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఏపీ ( AP) ఎన్నికల రాజకీయం చాలా హీట్ లో ఉంది. అన్ని పార్టీలు వారి వారి ప్రయత్నాలు చేస్తున్నాయి. చాలా సర్వేలు ..రాజకీయ వాదోపవాదాలు నడుస్తున్నాయి. అయితే ఢిల్లీ లో రుద్రకరణ్ చెప్పిన జోస్యం నిజమైంది.2022 మార్చిలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎదుర్కోబోయే సమస్యల గురించి జోష్యం చెప్పారు. మార్చి 2024 లో ఆయన అనేక ఇబ్బందుల్లో చిక్కుకుంటారని అప్పట్లోనే అంచనా వేశారు.

ఇప్పుడు ఢిల్లీ( DELHI) లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్టయ్యారు. దీంతో రెండేళ్ల క్రితం రుద్ర కరణ్ ప్రతాప్ తన అంచనాలతో చేసిన సోషల్ మీడియా( SOCIAL MEDIA) పోస్టింగ్స్ వైరల్ అవుతున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాలపై కూడా రుద్రకరణ్ కూడా ఓ అంచనా జోస్యం చెప్పారు. ఈ జోస్యాన్ని ఆయన జూన్ లో తెలిపారు. మరోసారి జగన్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని తన అంచనాగా వెల్లడించారు.

ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా జగన్( JAGAN) తన ప్రభుత్వాన్ని కొనసాగిస్తారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కేజ్రీవాల్ విషయంలో రుద్రకరన్ ప్రతాప్ చెప్పింది నిజం కావడంతో, ఏపీ ఎన్నికల ఫలితాల పైన ఆయన చెప్పిందే నిజం అవుతుందా అంటూ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. జగన్, చంద్రబాబు, పవన్ ఈనెల 27 నుంచి తమ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. పోటాపోటీగా సాగే ప్రచారం ద్వారా ఎన్నికల్లో గెలుపు దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు సర్వే సంస్థలు , మరో వైపు జోస్యాలు ఏపీ ఎన్నికలపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.

Tags:
Next Story
Share it