pavan kalyan : విశాఖలో జరిగిన ఘటన పై స్పందించిన పవన్

విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం జిరిగిన సంగతి తెలిసిందే. అగ్ని ప్రమాదంలో 40 బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. రూ.40 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు

pavan kalyan : విశాఖలో జరిగిన ఘటన పై స్పందించిన పవన్
X

న్యూస్ లైన్, విశాఖ : విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం జిరిగిన సంగతి తెలిసిందే. అగ్ని ప్రమాదంలో 40 బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. రూ.40 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. ఈ దుర్ఘటన పై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ స్పందించారు. ఫిషింగ్ హార్బర్‌లో అర్థరాత్రి చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో బోట్లు దగ్ధం కావడం దురదృషకరమని అన్నారు.

ఈ ప్రమాదం వల్ల నష్టపోయిన బోట్ల యజమానులను ప్రభుతవం అన్ని విధాలుగా ఆదుకోవాలని పవన్ డిమాండ్ చేశారు. బోట్ల పై ఆధారపడిన మత్స్యకారులకు జీవన భృతి అందించాలని కోరారు. ఈ ఘటన పై విచారణ జరిపి భద్రతపరమైన అంశాలపై సమీక్షించాలని కోరారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా, ఈ దుర్ఘటన ఓ యూట్యూబర్ వల్ల జరిగిందని హార్బర్ వ్యాప్తంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. బోట్ అమ్మకం విషయంలో ఇద్దరికి గొడవ జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బోటును తగలబెట్టినట్టు సమాచారం. దీని పై పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారనేది తెలియాల్సి ఉంది.

Tags:
Next Story
Share it