Janasena : రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చేసిన పవన్ కళ్యాణ్..గందరగోళంలో కార్యకర్తలు!

టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 ఎమ్మెల్యే స్థానాల్లో, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేలను, రెండు ఎంపీ స్థానాలను ప్రకటించిన పవన్ కళ్యాణ్, నేడు అవనిగడ్డ, రైల్వే కోడూరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.

Janasena : రైల్వే కోడూరు అభ్యర్థిని మార్చేసిన పవన్ కళ్యాణ్..గందరగోళంలో కార్యకర్తలు!
X

న్యూస్ లైన్ డెస్క్: టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 ఎమ్మెల్యే స్థానాల్లో, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే 18 మంది ఎమ్మెల్యేలను, రెండు ఎంపీ స్థానాలను ప్రకటించిన పవన్ కళ్యాణ్, నేడు అవనిగడ్డ, రైల్వే కోడూరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇటీవలే పిఠాపురం లో పవన్ కళ్యాణ్ సమక్షం లో అవనిగడ్డ టీడీపీ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ చేరారు. ఇప్పుడు ఆయనకే ఎమ్మెల్యే స్థానాన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్. అవనిగడ్డ నియోజకవర్గం లో ఎంతో కాలం నుండి కష్టపడి పని చేస్తున్న జనసేన పార్టీ ఇంచార్జి బండి రామకృష్ణ ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ మండలి బుద్దా ప్రసాద్ కి ప్రకటించడం పై జనసేన పార్టీ శ్రేణుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది.

ఇది కాసేపు పక్కన పెడితే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అభ్యర్థి విషయం లో కూడా మార్పు జరిగింది. తొలుత ఈ స్థానం నుండి యనమల భాస్కర్ రావు పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది జనసేన పార్టీ. కానీ ఆ తర్వాత నిర్వహించిన సర్వేలలో భాస్కర్ రావు కి అంతగా పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడం , దానికి టీడీపీ, జనసేన రైల్వే కోడూరు కార్యకర్తలు భాస్కర్ రావు పెద్దిరెడ్డి మనిషి అని, అతనికి నియోజకవర్గం లో వ్యతిరేకత ఉందని చెప్పడం తో, ఆయన స్థానం లో ఆరవ శ్రీధర్ పేరు ని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఇక కేవలం పాలకొండ నియోజకవర్గానికి అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం ఉంది. రెండు మూడు రోజుల్లో ఈ అభ్యర్థి కూడా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Tags:
Next Story
Share it