Mangalagiri : మధ్యవర్తిత్వం చేసినందుకు నా నుండి 3 సీట్లు లాగేసారు - పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ రాబొయ్యే ఎన్నికలలో కేవలం 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చెయ్యబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పార్టీ కి 60 నియోజకవర్గాలలో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ, కేవలం 21 స్థానాలకు మాత్రమే పరిమితం అవ్వడం అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు.

Mangalagiri : మధ్యవర్తిత్వం చేసినందుకు నా నుండి 3 సీట్లు లాగేసారు - పవన్ కళ్యాణ్
X

న్యూస్ లైన్, మంగళగిరి : జనసేన పార్టీ రాబొయ్యే ఎన్నికలలో కేవలం 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చెయ్యబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పార్టీ కి 60 నియోజకవర్గాలలో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ, కేవలం 21 స్థానాలకు మాత్రమే పరిమితం అవ్వడం అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. పవన్ కళ్యాణ్ టీడీపీ, బీజేపీ పార్టీలకు లొంగిపోయారని, ఇంతలా తగ్గిపోతాడని ఊహించలేదంటూ సోషల్ మీడియా లో కన్నీళ్లు పెట్టుకున్నారు. వాస్తవానికి తొలుత 24 స్థానాల్లో పోటీ చెయ్యాలని అనుకున్న పవన్ కళ్యాణ్, ఆ తర్వాత బీజేపీ పార్టీ ని కూడా పొత్తులోకి ఆహ్వానించడం తో వాళ్ళ కోసం మూడు ఎమ్మెల్యే స్థానాలు, ఒక ఎంపీ స్థానం త్యాగం చేసారు పవన్ కళ్యాణ్.

దీని గురించి నేడు ఆయన జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ 'రాష్ట్రంకి నిధులు రావాలన్నా, వైసీపీ పార్టీ బలగం ని అదుపు చెయ్యాలన్నా బీజేపీ పార్టీ తో పొత్తు అనివార్యం. నేనే పొత్తు కావాలని బలంగా కోరుకున్నాను. ఇద్దరి మధ్య సయోధ్య కుదిరించి పొత్తు ని ఏర్పాటు చేశాను. అలా మధ్యవర్తిత్వం చేసినందుకు బీజేపీ నా నుండి మూడు ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానం లాగేసుకుంది. రాష్ట్ర ప్రయోజనం కోసం తగ్గక తప్పలేదు. అలా తగ్గాను కాబట్టే ఈరోజు బీజేపీ పార్టీ పొత్తులో ఉంది.' అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.

Tags:
Next Story
Share it