Tdp - Janasena : అభ్యర్థులను ప్రకటించడానికి వణికిపోతున్న చంద్రబాబు - పవన్ కళ్యాణ్!

ఒకపక్క వైసీపీ పార్టీ ఇప్పటికే రెండు విడతల ద్వారా అభ్యర్థుల జాబితా ని విడుదల చేసి ఎన్నికల రణరంగానికి సిద్ధం అవుతుంటే, మరోపక్క టీడీపీ - జనసేన తమ అభ్యర్థుల జాబితా ని విడుదల చెయ్యడానికి భయపడిపోయాయి.

Tdp - Janasena : అభ్యర్థులను ప్రకటించడానికి వణికిపోతున్న చంద్రబాబు - పవన్ కళ్యాణ్!
X

Newsline, Amaravati : ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ మరియు జనసేన పార్టీ కలయిక వైసీపీ కి ఎంత నష్టం చేస్తుంది అనేది కాసేపు పక్కన పెడితే, ఆ రెండు పార్టీలే తీవ్రంగా నష్టపొయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ పార్టీ ని ఎదురుకోవడం కంటే ముందు, ఇరు పార్టీల అధినేతలు సొంత క్యాడర్ మరియు లీడర్స్ ని ఎదురుకోవడం పెద్ద సవాల్. ఎందుకంటే సీట్ల సర్దుబాటు విషయం లో ఇంకా పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు నాయుడు మధ్య ఒక క్లారిటీ రావడం లేదు. పొత్తు ప్రకటించిన తర్వాత చంద్రబాబు నాయుడు మరియు టీడీపీ లీడర్స్ పవన్ కళ్యాణ్ మహా అయితే 20 సీట్లు తీసుకుంటాడేమో, ఇచ్చేద్దాం పెద్ద సమస్య ఏమి లేదని అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఏకంగా 70 స్థానాలను అడిగి చంద్రబాబు నాయుడు కి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసాడు. కానీ చంద్రబాబు నాయుడు అంత ఇవ్వలేమని, ఎదో 30 సీట్లు అయితే సర్దుబాటు చెయ్యగలం అని పవన్ కళ్యాణ్ తో అన్నాడట.

ఈ విషయం తెలుగు దేశం పార్టీ అనుకూల మీడియా లీక్ చేసింది. జనసేన కి కేవలం 22 నుండి 30 స్థానాల మధ్యలోనే సీట్లు కేటాయించబోతున్నారని, పవర్ షేరింగ్ కూడా ఉండదు అంటూ ప్రచారం చేసారు. ఈ వార్తపై పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన క్యాడర్ మరియు కాపు సంఘాలు భగ్గుమన్నాయి. చంద్రబాబు ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేపని అయితే పొత్తుకు ఓటు వేసే సమస్యే లేదని, పవర్ షేరింగ్ మరియు 55 సీట్లు ఇస్తేనే కాపు సామజిక వర్గపు ఓట్లు పడుతాయని, లేకపోతే జనసేన లేని చోట్ల టీడీపీ ని ఓడించడానికి ప్రయత్నం చేస్తాం ఖబర్దార్ అంటూ లేఖను రాసారు. మరోపక్క 30 కి మించి ఒక్క సీట్ జనసేన కి ఇచ్చిన మేము పొత్తుకు సహకరించము అంటూ టీడీపీ క్యాడర్ చంద్రబాబు నాయుడు కి సంకేతాలు ఇస్తుంది. ఈ సమయం లో అభ్యర్థులను ప్రకటిస్తే ఎలాంటి రచ్చ జరుగుతుందో అని అటు పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు భయపడిపోతున్నారు.

Tags:
Next Story
Share it