New Delhi : ఢిల్లీ లో చంద్రబాబు,పవన్ కళ్యాణ్ పాట్లు..పగోడికి కూడా ఈ కష్టం రాకూడదు!

ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడ చూసినా బీజేపీ గురించే చర్చ. ఎందుకంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ తో పొత్తు కోసం గత మూడు నెలలుగా వెంపర్లాడడమే అందుకు కారణం.

New Delhi : ఢిల్లీ లో చంద్రబాబు,పవన్ కళ్యాణ్ పాట్లు..పగోడికి కూడా ఈ కష్టం రాకూడదు!
X

న్యూస్ లైన్, న్యూ ఢిల్లీ : ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో ఎక్కడ చూసినా బీజేపీ గురించే చర్చ. ఎందుకంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బీజేపీ తో పొత్తు కోసం గత మూడు నెలలుగా వెంపర్లాడడమే అందుకు కారణం. 2019 ఎన్నికలలో బీజేపీ పార్టీ కి కనీసం ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. అలాంటి పార్టీ తో పొత్తు కోసం ఇంత తపన పడడం ఏమిటి? అని చాలా మందికి అంతు చిక్కని ప్రశ్న. రెండు రోజుల క్రితం వీళ్లిద్దరు ఢిల్లీ కి వెళ్లారు. వెళ్లిన వెంటనే వీళ్లకు అమిత్ షా అప్పాయింట్మెంట్ ఆర్డర్ దొరకలేదు. మొన్న ఉదయం ఢిల్లీ కి చేరుకున్న చంద్రబాబు, సాయంత్రం వరకు వేచి చూడాల్సి వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా సాయంత్రం సమయం లోనే వచ్చి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ భేటీ లో సీట్ల సర్దుబాటు విషయం లో అమిత్ షా తో ఏకాభిప్రాయం కలగలేదు.

ఆ తర్వాత పక్కరోజు మరోమారు అమిత్ షా తో చర్చలు జరపడానికి వెళ్లారు. కానీ ఆరోజు అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. రోజు మొత్తం ఎదురు చూసి, నేడు ఉదయం 11 గంటలకు మరోసారి చర్చించుకున్నారు. చంద్రబాబు తో కలిసేందుకు అమిత్ షా కి బీజేపీ పెద్దలకు ఎలాంటి ఇష్టం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ అభ్యర్థన కారణంగానే పొత్తుకు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. పవన్ కల్యాణే స్వయంగా భీమవరం లో ఈ విషయం చెప్పుకొచ్చారు. ఈ పొత్తుని కుదిరించడానికి ఎన్నో తిట్లు తిన్నాను అని. మరి ఈ పొత్తు చివరి అంకం లో ఇంకెన్ని తిట్లు తిన్నారో అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే బీజేపీ కోసం ఒక ఎంపీ స్థానాన్ని త్యాగం చేసారు పవన్ కళ్యాణ్. ఇక ఎమ్మెల్యే స్థానాలు ఎన్ని చేస్తారో చూడాలి.

Tags:
Next Story
Share it