Undavalli : ఉండవల్లి లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తో ఉండవల్లిలో భేటీ అయ్యాడు. నేడు వీళ్లిద్దరి మధ్య సీట్ల సర్దుబాటు విషయం లో తుది చర్చ జరిగినట్టు సమాచారం.

Undavalli : ఉండవల్లి లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ!
X

న్యూస్ లైన్, అమరావతి : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తో ఉండవల్లిలో భేటీ అయ్యాడు. నేడు వీళ్లిద్దరి మధ్య సీట్ల సర్దుబాటు విషయం లో తుది చర్చ జరిగినట్టు సమాచారం. ఇప్పటికే 25 స్థానాల గురించి ఒక క్లారిటీ వచ్చిందని, మిగిలిన స్థానాల గురించే నేడు చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం, లేదా రేపు ఇరు పార్టీలకు సంబంధించి మొదటి విడత ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాని విడుదల చేయబోతున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ మొదటి నుండి టీడీపీ ని 60 నుండి 70 స్థానాలు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. చంద్రబాబు అంచనాలకు పూర్తి బిన్నంగా పవన్ కళ్యాణ్ సీట్లు అడగడం తో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారట. అలా వీళ్ళ మధ్య రెండు మూడు సార్లు సీట్ల సర్దుబాటు గురించి భేటీ అవ్వగా నేడు జనసేన కి కేటాయించే స్థానాల పట్ల పూర్తి అవగాహనకి వచ్చినట్టు తెలుస్తుంది.

సీట్ల సర్దుబాటు విషయం కోసమే చంద్రబాబు నాయుడు తన 'రా..కదలిరా' మీటింగ్స్ కి వారం రోజులు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది. రేపటి నుండి ఆయన యదావిధిగా ఈ మీటింగ్స్ ని ప్రారంభించబోతున్నాడు. ఇక జనసేన పార్టీ కి కూడా సీట్లు దాదాపుగా ఖరారు అయిపోవడం తో పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికల ప్రచారం లో పాల్గొనడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీని గురించి కూడా జనసేన పార్టీ అధికారిక ప్రకటన త్వరలోనే చేయబోతుంది.

Tags:
Next Story
Share it