YCP: వైసీపీ విజయం ఇక నల్లేరు మీద నడకే..చేతులారా నాశనం చేసుకున్న టీడీపీ - జనసేన!

ఏ ముహూర్తంలో టీడీపీ - జనసేన పొత్తు పెట్టుకుందో తెలియదు కానీ, ఈ ఇరు పార్టీలు తీసుకునే నిర్ణయాలు వైసీపీ విజయానికి మెట్లు లాగా మారుతున్నాయి.

YCP: వైసీపీ విజయం ఇక నల్లేరు మీద నడకే..చేతులారా నాశనం చేసుకున్న టీడీపీ - జనసేన!
X

న్యూస్ లైన్, అమరావతి : ఏ ముహూర్తంలో టీడీపీ - జనసేన పొత్తు పెట్టుకుందో తెలియదు కానీ, ఈ ఇరు పార్టీలు తీసుకునే నిర్ణయాలు వైసీపీ విజయానికి మెట్లు లాగా మారుతున్నాయి. మొదట్లో టీడీపీ, జనసేన కలిస్తే వైసీపీ ఓటమి తథ్యం అని రాజకీయ విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. కానీ పొత్తు ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ పూర్తిగా వారాహి విజయ యాత్ర ని ఆపేయడం, టీడీపీ సభలకు జనాలు కరువు అవ్వడం, చంద్రబాబు నాయుడు రొటీన్ ప్రసంగాలు జనాలకు బోర్ కొట్టడం, ఇలా ప్రతీ ఒక్కటి వైసీపీ కి పాజిటివ్ గా మారింది. మరోపక్క జగన్ తలపెట్టిన 'సిద్ధం' కార్యక్రమానికి జనాలు బ్రహ్మరథం పట్టడం, పవన్ కళ్యాణ్ ఇప్పటికీ కూడా బయటకి రాకపోవడం వల్ల వైసీపీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. దానికి తోడు ఇరు పార్టీల మధ్య ఇంకా సీట్ల సర్దుబాటు కార్యక్రమం పూర్తిగా జరగలేదు. ఇన్ని సమస్యల మధ్య ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి బీజేపీ తో పొత్తు పెట్టుకోవడం వైసీపీ విజయం కి నల్లేరు మీద నడక లాగ మారబోతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

బీజేపీ పార్టీ పొట్టులోకి ప్రవేశిస్తే కనీసం 8 ఎమ్మెల్యే స్థానాలు, నాలుగు ఎంపీ స్థానాలు కోరుతుంది. అంత మించి కూడా డిమాండ్ చెయ్యొచ్చు. అసలు ఆంధ్ర ప్రదేశ్ లో ఏమాత్రం ఓటు బ్యాంక్ లేని బీజేపీ తో పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన పవన్ కళ్యాణ్, చంద్రబాబు కి ఎలా వచ్చిందో అని ఇరువురి పార్టీల అభిమానులు జుట్టు పీక్కుంటున్నారు. పొత్తు వల్ల బీజేపీ కి ఓట్లు బాగా పడొచ్చు, డిపాజిట్స్ రావొచ్చేమో కానీ, గెలిచేంత స్థాయి అయితే లేదు. అదే స్థానం లో టీడీపీ, జనసేన పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉంటుంది. ఈ చిన్న లాజిక్ ఆలోచించకుండా బీజేపీ తో పొత్తు పెట్టుకోవాలనుకోవడం కచ్చితంగా ఆత్మహత్య చర్యనే అని అంటున్నారు. బీజేపీ మీద వివిధ అంశాలలో ఇప్పటికీ జనాల నుండి నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయం లో అలాంటి పార్టీ తో పొత్తు పెట్టుకుంటే జగన్ 100 స్థానాలు గెలవడం పక్కా అని అంటున్నారు రాజకీయా విశ్లేషకులు.

Tags:
Next Story
Share it