Janasena Party : మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్!

రాబొయ్యే సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తులో భాగంగా 21 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ ఇప్పటి వరకు 18 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

Janasena Party : మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్!
X

న్యూస్ లైన్,విశాఖపట్నం: రాబొయ్యే సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ, బీజేపీ పార్టీలతో పొత్తులో భాగంగా 21 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేన పార్టీ ఇప్పటి వరకు 18 ఎమ్మెల్యే స్థానాలు, రెండు ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. విశాఖపట్నం సౌత్, పాలకొండ, అవనిగడ్డ ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యే స్థలను పెండింగ్ లో ఉంచిన పవన్ కళ్యాణ్ నేడు విశాఖపట్నం సౌత్ స్థానం నుండి వంశీ కృష్ణ యాదవ్ పోటీ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. వంశీ కృష్ణ యాదవ్ గత ఏడాది వైసీపీ పార్టీ నుండి జనసేన లోకి వచ్చారు.

అంతకు ముందు ఆయన చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ లో విశాఖ సౌత్ నుండి పోటీ చేసి కేవలం 300 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ ఈసారి మాత్రం విశాఖ సౌత్ లో అత్యధిక మెజారిటీ తో గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు వంశీ కృష్ణ యాదవ్. ఇక జనసేన ఖాతాలో రెండు ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి. ఒకటి అవనిగడ్డ కాగా, మరొకటి పాలకొండ. అవనిగడ్డ నుండి జనసేన పార్టీ కి ఎక్కువ ఆశావహులు ఉండడం తో సర్వే నిర్వహించి సరైన అభ్యర్థికి ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారట. అవనిగడ్డ టికెట్ కోసం వంగవీటి రాధా కృష్ణ కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకటి, రెండు రోజుల్లోగా మిగిలిన రెండు ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Tags:
Next Story
Share it