Pawan Kalyan : మహేష్‌బాబు నాన్న చనిపోతే జగన్ వెళ్లి నవ్వుతాడు !

Pawan Kalyan : మహేష్ బాబు తండ్రి కృష్ణ చనిపోయి బాధలో ఉంటే అక్కడికి వెళ్లి జగన్ నవ్వుతాడంటూ

Pawan Kalyan :  మహేష్‌బాబు నాన్న చనిపోతే జగన్ వెళ్లి నవ్వుతాడు !
X

Pawan Kalyan : మహేష్ బాబు తండ్రి కృష్ణ చనిపోయి బాధలో ఉంటే అక్కడికి వెళ్లి జగన్ నవ్వుతాడంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హాట్‌ కామెంట్స్‌ చేశారు. నిన్న తాడెపల్లి గూడెంలో వారాహి యాత్రను కొనసాగించారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ...జగన్.. నువ్వు ఉపాధి అవకాశాలు కల్పించవు, పరిశ్రమలు రానివ్వవు, పారిశ్రామికవేత్తలను బతకనివ్వవంటూ నిప్పులు చెరిగారు.

ఎవరైనా కంపెనీ పెడితే...వైసీపీ ఎమ్మెల్యేలు లంచాలు కావాలని పీడించేస్తారని మండిపడ్డారు. యువత ఎక్కడికి వెళ్ళాలి.. తెలంగాణకి వెళ్తే వాళ్ళేమో మీ ఆంధ్ర వాళ్లు దోచేశారు.. దొబ్బేయండి అని తిడుతున్నారని నిప్పులు చెరిగారు. మీ నాన్న లాగా, నీలాగా దొచేయడానికి మా దగ్గర డబ్బుల్లేవు. మేము మా నేల లోనే బతకాలన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.

Tags:
Next Story
Share it