Tdp- Janasena : 75 స్థానాలు ఇవ్వాల్సిందే అంటున్న పవన్ కళ్యాణ్..ఎల్లుండి క్లారిటీ వచ్చే అవకాశం?

ఆంధ్ర ప్రదేశ్ లో మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతునన్ నేపథ్యం టీడీపీ - జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి వచ్చినట్టు సమాచారం.

Tdp- Janasena : 75 స్థానాలు ఇవ్వాల్సిందే అంటున్న పవన్ కళ్యాణ్..ఎల్లుండి క్లారిటీ వచ్చే అవకాశం?
X

న్యూస్ లైన్ , అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ పార్టీ మూడు విడతలుగా తమ అభ్యర్థుల జాబితాని విడుదల చేసేసింది. కానీ టీడీపీ - జనసేన మాత్రం ఇంకా అభ్యర్థుల జాబితాని విడుదల చెయ్యలేదు. ఇంకా వీళ్లిద్దరి మధ్య సీట్ల సర్దుబాటు విషయం లో ఏకాభిప్రాయానికి రాలేదని రాజకీయ వర్గాల్లో జోరుగా సాగిన చర్చ. అయితే ఈరోజు భోగి సందర్భంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలిసి భోగి పండుగ జరుపుకున్నాడు. నిన్న రాత్రే నాదెండ్ల మనోహర్ తో కలిసి తాడేపల్లిలో ఉన్న చంద్రబాబు ఇంటికి చేరుకున్న పవన్ కళ్యాణ్, ఉమ్మడి మ్యానిఫెస్టో పై, అలాగే సీట్ల సర్దుబాటు పై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. జనసేన పార్టీ కూటమి లోకి అడుగుపెట్టిన రోజు నుండి ఇప్పటి వరకు మూడు సార్లు సీట్ల సర్దుబాటు గురించి చర్చలు జరిపారు. ఈ మూడుసార్లు కూడా పవన్ కళ్యాణ్ 70 నుండి 75 సీట్లను డిమాండ్ చేస్తూ వచ్చాడు.

కానీ టీడీపీ అన్ని స్థానాలను ఇవ్వలేమని, 40 స్థానాలు ఇవ్వడానికి సిద్ధం అంటూ ప్రతిపాదన పెట్టింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు ససేమీరా ఒప్పుకోలేదు. కోస్తాంధ్ర ప్రాంతం మొత్తం కాపు సామాజిక వర్గపు ఓట్లు ఒక్క శాతం కూడా చీలకుండా కూటమికి పడాలంటే కచ్చితంగా 75 ఎమ్యెల్యే స్థానాలు, 10 ఎంపీ స్థానాలు ఉండాల్సిందే అని, లేకపోతే మా క్యాడర్ ముందుకు పొయ్యే సాహసం కూడా చేయలేనని పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన తుది సమావేశం లో తేల్చి చెప్పాడట. ఇక చేసేది ఏమి లేక చంద్రబాబు కూడా అందుకు ఒప్పుకున్నట్టు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఈ నెల 26 వ తేదీన పవన్ కళ్యాణ్ - చంద్రబాబు సమక్ష్యం లో భారీ బహిరంగ సభ ఉంటుందని, ఈ సభలోనే ఉమ్మడి మ్యానిఫెస్టో తో పాటుగా, ఇరు పార్టీలకు సంబంధించి మొదటి విడత ఎమ్యెల్యే అభ్యర్థుల జాబితాని విడుదల చేస్తారని సమాచారం.

Tags:
Next Story
Share it