Pawan Kalyan: పులివెందుల వేషాలు ఇక్కడ చూపిస్తే ఊరుకోం!

పులివెందుల వేషాలు ఇక్కడ వేస్తే ఊరుకోమని జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం మచిలీపట్నంలో నిర్వహించిన జనవాణిలో ఆయన మాట్లాడారు. అధికారం కోసం ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారని విమర్శించారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో నోటికి ఏదొస్తే అది హామీగా ఇచ్చేశారని, అప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా

Pawan Kalyan: పులివెందుల వేషాలు ఇక్కడ చూపిస్తే ఊరుకోం!
X

న్యూస్‌లైన్, డెస్క్: పులివెందుల వేషాలు ఇక్కడ వేస్తే ఊరుకోమని జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం మచిలీపట్నంలో నిర్వహించిన జనవాణిలో ఆయన మాట్లాడారు. అధికారం కోసం ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారని విమర్శించారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో నోటికి ఏదొస్తే అది హామీగా ఇచ్చేశారని, అప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు.

రేపు పెడన నియోజకవర్గంలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభ నిర్వహించనున్నామని, కానీ రేపటి సభలో దాడులు చేయడానికి కొంతమంది వైసీపీ కిరాయి గూండాలతో దాడులు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారన్నారు. దయచేసి జనసైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరు అనుమానంగా ఉన్నా జేబుల్లో నుంచి ఆయుధాలు తీసినా వారిని పట్టుకోవాలని తెలిపారు. జనసేన, టీడీపీ పొత్తు విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోందని, పులివెందుల రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. పెడన సభలో గొడవలు పెట్టాలని వైసీపీ భావిస్తే ఏ మాత్రం సహించేది లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.

Tags:
Next Story
Share it