Janasena : ఫిబ్రవరి 29 నుండి 100 బహిరంగ సభలు ప్లాన్ చేసిన పవన్ కళ్యాణ్

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల పర్వం సరిగ్గా 52 రోజుల్లో మొదలు కాబోతుంది. రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాలతో వారు జనాల్లోకి వెళ్తున్నారు. సీఎం జగన్ ఇప్పటికే చేపట్టిన 'సిద్ధం' కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తుంది. కానీ చంద్రబాబు 'రా..కదలిరా' సభలకు అంతంత మాత్రం గానే ఆదరణ దక్కుతుంది. ఇక లోకేష్ చేపట్టిన 'శంఖారావం' యాత్ర గురించి ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు.

Janasena : ఫిబ్రవరి 29 నుండి 100 బహిరంగ సభలు ప్లాన్ చేసిన పవన్ కళ్యాణ్
X

న్యూస్ లైన్, అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల పర్వం సరిగ్గా 52 రోజుల్లో మొదలు కాబోతుంది. రాజకీయ పార్టీలు ఎవరి వ్యూహాలతో వారు జనాల్లోకి వెళ్తున్నారు. సీఎం జగన్ ఇప్పటికే చేపట్టిన 'సిద్ధం' కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తుంది. కానీ చంద్రబాబు 'రా..కదలిరా' సభలకు అంతంత మాత్రం గానే ఆదరణ దక్కుతుంది. ఇక లోకేష్ చేపట్టిన 'శంఖారావం' యాత్ర గురించి ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు. ఇప్పుడు టీడీపీ కి పవన్ కళ్యాణ్ బయటకి వచ్చే అవసరం చాలా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం అక్టోబర్ నెల నుండి తన 'వారాహి విజయ యాత్ర' ని పూర్తిగా నిలిపేసాడు. దీంతో జనసేన పార్టీ కార్యకర్తల్లో తీవ్రమైన అసహనం మొదలైంది. అసలు ఈ పవన్ కళ్యాణ్ ఏమి చేస్తున్నాడు?, ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నాడు అంటూ అభిమానులు సోషల్ మీడియా లో ట్యాగ్ చేసి అడుగుతూ ఉన్నారు.

అయితే పవన్ కళ్యాణ్ రాక కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు, కార్యకర్తలకు ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త తెగ వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ రేపు వైజాగ్ కి రాబోతున్నాడట. ఇక్కడ రెండు నుండి మూడు రోజులు పర్యటించి, జనసేన పార్టీ కీలక నాయకులతో చర్చలు జరిపి, 21 వ తేదీన చంద్రబాబు తో కలిసి ఢిల్లీ కి వెళ్ళబోతున్నాడట. అక్కడ చర్చలు జరిపిన తర్వాత బీజేపీ తో పొత్తుని అధికారికంగా ప్రకటించి, ఆ తర్వాత నెలాఖరు నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం మొదలు పెట్టబోతున్నాడట. సుమారుగా వందకి పైగా బహిరంగ సభలు, రోడ్ షోస్ కి తగినట్టుగా రూట్ మ్యాప్ సిద్ధం అయ్యినట్టు తెలుస్తుంది.

Tags:
Next Story
Share it