Pithapuram : పిఠాపురం వర్మని సస్పెండ్ చెయ్యమని టీడీపీ ని డిమాండ్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్!

పిఠాపురం లో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కిపోతున్నాయి. ఈ ప్రాంతం లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన పొత్తుపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.

Pithapuram : పిఠాపురం వర్మని సస్పెండ్ చెయ్యమని టీడీపీ ని డిమాండ్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్!
X

న్యూస్ లైన్, పిఠాపురం : పిఠాపురం లో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కిపోతున్నాయి. ఈ ప్రాంతం లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన పొత్తుపై తీవ్రమైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఇష్టానుసారంగా ఆయన మాట్లాడుతున్న మాటలు జనసేన పార్టీ శ్రేణులకు, క్యాడర్ కి తీవ్రమైన కోపం రప్పించేలా చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చెయ్యబోతున్నాని అని ప్రకటించిన వెంటనే వర్మ శ్రేణులు పిఠాపురం లో పెద్ద ఎత్తున రచ్చ చేసారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్ లను దూషిస్తూ అనేక మాటలు అన్నారు. ఆ తర్వాత వర్మ ని పిలిపించి చంద్రబాబు నాయుడు సర్దిచెప్పి ఒక ఎమ్మెల్సీ, మినిస్టర్ పదవి ఇస్తానని హామీ ఇవ్వడం తో వర్మ జనసేన పార్టీ కి మద్దతు తెలిపి, పవన్ కళ్యాణ్ ని రికార్డు స్థాయి మెజారిటీ తో గెలిపించుకుంటామని చెప్పుకొచ్చారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, వర్మ మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ కి సపోర్టు చేస్తున్నట్టుగా పవన్ అభిమానులకు అనిపించలేదు.

మాటికొస్తే జనసైనికులను రెచ్చగొట్టే విధంగా వర్మ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్రమైన కోపాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవల కార్యకర్తల సమావేశం లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఒకవేళ బీజేపీ పెద్దలు ఎంపీ పోటీ చెయ్యమని ఎక్కువగా ఒత్తిడి చేస్తే, ఉదయ్ పిఠాపురం ఎమ్మెల్యే గా చేస్తారు, నేను ఎంపీ గా చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలపై వర్మ స్పందిస్తూ 'ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేయకుంటే, నేను ఆ స్థానం నుండి టీడీపీ తరుపున పోటీ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు అదే చెప్పారు ' అంటూ చెప్పుకొచ్చారు. పొత్తులో ఉన్న అధినేత పోటీ చేసే స్థానం పైన, ఆయన మాటల పైన వర్మ కి ఎలాంటి గౌరవం లేదని, ఇలాంటోళ్లను పార్టీ లో పెట్టుకుంటే ఇతను చేసే వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా పొత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని, తక్షణమే అతనిని క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చెయ్యాలంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టీడీపీ ని రిక్వెస్ట్ చేస్తున్నారు.

Tags:
Next Story
Share it