Varahi Yaatra : పవన్ కళ్యాణ్ 'వారాహి విజయ యాత్ర' లేటెస్ట్ షెడ్యూల్ ఖరారు!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన 'వారాహి విజయ యాత్ర' ని రాజానగరం నుండి తిరిగి ప్రారంభించబోతున్నాడు.

Varahi Yaatra : పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర లేటెస్ట్ షెడ్యూల్ ఖరారు!
X

Newsline , Rajanagaram: రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన పవన్ కళ్యాణ్ 'వారాహి విజయ యాత్ర' గత కొంత కాలం గా ఆగిపోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో సునామి ని సృష్టించిన ఈ యాత్ర ఇలా ఆగిపోయిందే, మళ్ళీ ఎప్పుడు తిరిగి ప్రారంభం అవుతుంది అని జనసేన పార్టీ కార్యకర్తలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు జైలు కి వెళ్లడం, పవన్ కళ్యాణ్ టీడీపీ తో పొత్తు ప్రకటించడం దగ్గర నుండి జనసేన లో అంతకు ముందు ఉన్న దూకుడు కనిపించడం లేదు. పొత్తు సమీకరణాలు , ఉమ్మడి మ్యానిఫెస్టో , అభ్యర్థుల ఎంపిక, ఇత్యాది విషయాల్లో చర్చలు కొనసాగిస్తూ, పవన్ కళ్యాణ్ వారాహి టూర్ ని ప్రస్తుతానికి పక్కన పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు అన్నీ కార్యక్రమాలు ఒక కొలిక్కి రావడం తో పవన్ కళ్యాణ్ తన వారాహి విజయ యాత్ర ని తిరిగి ప్రారంభించబోతున్నాడు.

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నుండి ఆయన ఈ యాత్ర ప్రారంభించబోతున్నాడు. ఆ నియోజకవర్గం లో దాదాపుగా మూడు రోజులపాటు పర్యటించబోతున్న పవన్ కళ్యాణ్, బహిరంగ సభలు, జనవాణి మరియు వివిధ కులాలకు చెందిన పెద్దలతో చర్చలు జరపబోతున్నాడు. ఈ యాత్ర ఇక్కడి నుండి నాన్ స్టాప్ గా ఉంటుందని, కోస్తాంద్ర మొత్తం వారాహి యాత్ర ఉండబోతుందని సమాచారం. ఈ యాత్ర లో పవన్ కళ్యాణ్ ప్రసంగాలు ఇంతకు ముందుకంటే ఎంతో పవర్ ఫుల్ గా, జనాలను ఆలోచింపచేసే విధంగా ఉంటుందట. ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు ఆయన వారాహి యాత్ర ని ముగించి, ఎన్నికల ప్రచారం కి సిద్ధం అవుతాడని టాక్. చూడాలి మరి జనసేనాని అడుగులు రాబొయ్యే రోజుల్లో ఎలాంటి పెను మార్పులను తీసుకొస్తుంది అనేది.

Tags:
Next Story
Share it