Pithapuram : పిఠాపురం లో పోటీకి పవన్ కళ్యాణ్ భయపడుతున్నారా?

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం చుట్టూనే తిరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చెయ్యబోతున్నారు.

Pithapuram : పిఠాపురం లో పోటీకి పవన్ కళ్యాణ్ భయపడుతున్నారా?
X

న్యూస్ లైన్ , పిఠాపురం : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం చుట్టూనే తిరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చెయ్యబోతున్నారు. ఇటీవలే ఆయన విషయాన్నీ స్వయంగా ప్రకటించారు. ఆయనకీ పోటీ గా వంగా గీత నిల్చింది. గతం లో ఈమె ప్రజారాజ్యం పార్టీ తరుపున పోటీ చేసి ఇదే పిఠాపురం నియోజకవర్గం లో గెలిచింది. అయితే సోషల్ మీడియా లో గత కొద్దిరోజుల నుండి పవన్ కళ్యాణ్ ని పిఠాపురం లో ఓడించేందుకు సీఎం జగన్ పెద్ద ప్లాన్ వేశారు. మండలానికి ఒక ఇంఛార్జిని పెట్టి డబ్బులు పంచె కార్యక్రమం ఇప్పటి నుండే మొదలు పెట్టారు.

ఓటుకి 20 నుండి 30 వేల రూపాయిలు ఇస్తారని, కుర్రాళ్లకు బైక్, ఆడవాళ్ళకు బంగారం ఇస్తారని, ఇలా ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నాయి. సోషల్ మీడియా లో ప్రచారమయ్యే ఈ కథనాలను నిన్న పవన్ కళ్యాణ్ ప్రస్తావించి మాట్లాడడం విశేషం. ఒక పార్టీ అధినేత అయ్యుండి, నిజానిజాలు తెలుసుకోకుండా, ఇలా ప్రచారం చెయ్యడం సరికాదు అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. అంతే కాకుండా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తనని ఓడించేందుకు ఇక్కడే తిష్ట వేశారని, అతని కంట్రోల్ చేసే బాధ్యత మీదే అంటూ పవన్ కళ్యాణ్ తన నాయకులతో మాట్లాడడం ని చూస్తుంటే ఆయన ఓటమి భయం పట్టుకుందని అందరూ అంటున్నారు. గతం లో ఆయన భీమవరం, గాజువాక లో ఓడిపోయిన అనుభవం వల్లే ఈ భయం పుట్టి ఉండొచ్చు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Tags:
Next Story
Share it