Pawan Kalyan: ఎవరు ఆపుతారో చూస్తా.. ఈసారి అసెంబ్లీలో అడుగుపెడతా!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో జనసేన వారాహి యాత్రను పవన్ ప్రారంభించారు.

Pawan Kalyan: ఎవరు ఆపుతారో చూస్తా.. ఈసారి అసెంబ్లీలో అడుగుపెడతా!
X

న్యూస్‌లైన్, డెస్క్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో జనసేన వారాహి యాత్రను పవన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవడు ఆపుతాడో చూస్తానని అన్నారు. తనను అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేయాలని తనపై కక్షగట్టారని, ఈసారి అడుగు పెడుతానని అన్నారు.

తాను వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వస్తానో.. కలిసి వస్తానో.. పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కానీ ఎన్నికల్లో మంచి వ్యూహంతో ముందుకు వెళ్తానని అన్నారు. సీఎం పదవి ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానని స్పష్టం చేశారు. రెండు చోట్ల నిలబడడం తనకు ఇష్టం లేదని, గతంలో తనను ఓడించేందుకు గట్టిగా ప్రయత్నించారని చెప్పారు.

జనసేన కేంద్ర కార్యాలయం మంగళగిరి నుంచి పనిచేస్తుందని, ఇకపై జనసేన రాజకీయాలన్ని ఏపీ నుంచే చేస్తామని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో ఎవరు తనను ఆపుతారో చూస్తానని అన్నారు. పార్టీని నడిపింపేందుకు తను సినిమాల్లో నటిస్తున్నానని అన్నారు. అన్యాక్రాంతంగా వచ్చిన ఆస్తులు తనకు లేవని పవన్ కళ్యాణ్ అన్నారు.

Tags:
Next Story
Share it